Abn logo
Oct 15 2021 @ 01:40AM

23న అగ్రి యూజీ కోర్సుల కౌన్సెలింగ్‌

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశఽ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల(2021-22)కు ఎన్నారై కోటా కింద ఈ నెల 23న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ర్టార్‌ గిరిధరకృష్ణ గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా ‘లాం’ వర్సిటీలో ఈ కౌన్సెలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు ఈ నెల 26వరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు.