మంచిర్యాలలో నకిలీ నోట్ల కలకలం

ABN , First Publish Date - 2021-01-10T08:09:34+05:30 IST

మంచిర్యాలలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్‌లో బోయిని రాజేందర్‌ అనే యువకుడు నకిలీ కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా వ్యాపారులు పట్టుకొన్నారు.

మంచిర్యాలలో నకిలీ నోట్ల కలకలం

మార్చేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న వ్యాపారులు

మంచిర్యాల, జనవరి 9(ఆంధ్రజ్యోతి): మంచిర్యాలలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్‌లో బోయిని రాజేందర్‌ అనే యువకుడు నకిలీ కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా వ్యాపారులు పట్టుకొన్నారు. మార్కెట్‌లో ఓ మహిళ వద్ద రూ.100 విలువైన కూరగాయలు కొనుగోలు చేశాడు. ఆమెకు రూ.500 నోటిచ్చి మిగతా రూ.400 తీసుకున్నాడు. అలాగే మరో మహిళ వద్ద కూరగాయలు కొనుగోలు చేసి మరో రూ.500 నోటును మార్చాడు. అలా ముగ్గురు మహిళల వద్ద నోట్ల మార్పిడికి పాల్పడ్డాడు. యువకుడు ఇచ్చిన కరెన్సీ నోటు మందంగా ఉండటంతో ఓ మహిళ పక్క వ్యాపారికి చూపించింది. అతను నకిలీ నోటుగా గుర్తించి మార్కెట్‌ అసోసియేషన్‌ సహకారంతో యువకుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి వివరాలు సేకరించారు. యువకుడు జైపూర్‌ మండలం నర్సింగాపూర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. అతని వద్ద రూ.10 వేల విలువైన 500, 200 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. దీంతో కరెన్సీతో సహా యువకుడిని పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-01-10T08:09:34+05:30 IST