Abn logo
Aug 4 2021 @ 00:43AM

అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు

హుండీ లెక్కిస్తున్న సిబ్బంది

బాసర,ఆగస్టు, 3 : బాసర సరస్వతి అమ్మవారి హుండీ కానుకలను మంగళవారం అ ధికారులు లెక్కించారు. రూ. 36 లక్షలు 90 వేలు 24 రూ పాయలు (36,94.024) నగ దు, మిశ్రమబంగారం 51 గ్రా ములు, మిశ్రమవెండి ఒక కిలో 790 గ్రాములు, వివిధ దేశాలకు చెందిన 12 కరెన్సీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం 120 రోజుల్లో ఆలయా నికి సమకూరింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, చైర్మెన్‌ శరత్‌ పాఠక్‌, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.