Abn logo
Sep 21 2021 @ 01:22AM

ఏకపక్షకంగా మరూరు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

మాట్లాడుతున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి మేనక



- కౌంటింగ్‌ పూర్తి కాకుండానే 

  వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించిన ఆర్‌ఓ

- రీకౌంటింగ్‌ చేయలేదు: టీడీపీ అభ్యర్థి ఆవేదన

రాప్తాడు, సెప్టెంబరు 20: మండలంలోని మరూరు ఎంపీటీ సీ ఓట్ల లెక్కింపును అధికారులు, పోలీసులు కలిసి ఏకపక్షంగా చేసి, వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని మేనక ఆవేదన వ్యక్తం చేశారు.  రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో ఆమె  సోమవారం ఆ పార్టీ మండల నాయకుల తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ... ఆదివారం ధర్మవరంలో ఉదయం నుంచి మరూరు ఎంపీటీసీ ఓట్లు లెక్కించకుండా కావాలనే ఆలస్యంగా కౌంటింగ్‌ చేశారన్నారు. టీడీపీకి మెజార్టీ వచ్చినప్పటికీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి ఒత్తిళ్లతో అధికారులు, పో లీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఓట్ల కట్టలను తారు మారు చేశారన్నారు. కౌంటింగ్‌ పూర్తి కాకుండానే వైసీపీ ఎంపీ టీసీ అభ్యర్థి 5 ఓట్ల మెజార్టీతో గెలు పొందినట్లు రిటర్నింగ్‌ అధికారి కృష్ణారావు ప్రకటించారన్నారు. రీ కౌంటింగ్‌ చేయమంటే చేయకుండా వైసీపీ ఏజెంట్లు, పోలీసులు తమతో వాగ్వాదానికి దిగి కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు పం పారన్నారు. ఎంపీ టీసీ ఓట్ల లెక్కింపులో అధికారులు, పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అధికారులు, పోలీసులు ఎమ్మెల్యే సోదరుడి ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయంగా వైసీపీని గెలిపించినా న్యాయంగా టీడీపీనే గెలిపించిందన్నారు. ఉన్నతాధికారులు ఓట్ల లెక్కింపు కేంద్రంలో సీసీ కెమెరాలు పరిశీలించి అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ మండల కన్వీ నర్‌ నారాయణస్వామి, మాజీ సర్పంచులు శ్రీనివాసులు, గోపాల్‌, నాయకులు నారాయణస్వామి, మరూరు గోపాల్‌, పంపు ఇంద్ర, గొందిరెడ్డిపల్లి ఎంపీటీసీ జాఫర్‌ఖాన, కొండప్ప, రమేష్‌, కేశవ, వెంకటేష్‌, కాటమయ్య, ముత్యాలప్ప, రాము తదితరులు పాల్గొన్నారు.