ఓట్ల లెక్కింపు నేడే

ABN , First Publish Date - 2021-09-19T05:46:25+05:30 IST

జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు, 554 మండల పరిషత ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ నోటిఫికేషన జారీ చేశారు.

ఓట్ల లెక్కింపు నేడే
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనరేట్‌ పంచాయతీరాజ్‌, జిల్లా ఎన్నికల ఇనచార్జి అధికారి సాగర్‌కుమార్‌రెడ్డి

12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

లెక్కించాల్సిన ఓట్లు 3,05,074

16 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు

అత్యధికంగా జమ్మలమడుగులో ఐదు మండలాలవి లెక్కింపు

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఎన్నికల యంత్రాంగం


ఆరు నెలలుగా నిరీక్షిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. గెలిచేదెవరో..? ఓటమి చవిచూసేది ఎవరో తేలిపోనుంది. గత ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగినా హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పుతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. సా్ట్రంగ్‌ రూంలో అభ్యర్థుల భవితవ్యం భద్రంగా దాచారు. ఆరు నెలల తర్వాత హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వడం.. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన ఇవ్వడంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలకు 49 మంది, 117 ఎంపీటీసీ స్థానాలకు 372 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,05,074 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అందు కోసం 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు, 554 మండల పరిషత ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ నోటిఫికేషన జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 2,684 మంది పోటీ చేశారు. వివిధ కారణాలు వల్ల 946 నామినేష్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 1,738 నామినేష్లను ఆమోదించినా.. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం, పోలీసులతో బెదిరింపులకు పాల్పడడంతో 1,317 మంది అభ్యర్థులు నామినేష్లను ఉప సంహరించుకున్నారు. 38 జడ్పీటీసీ, 432 ఎంటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన 432 ఎంపీటీసీ స్థానాలకు గానూ 417 వైసీపీ, 9 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాలు బీజేపీ, నాలుగు స్థానాలు స్వతంత్రులు దక్కించుకున్నారు. 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు 2020 మార్చి 14న పోలింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా ఉధృతి నేపధ్యంలో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఏడాది తరువాత గత ఏప్రిల్‌లో ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఏప్రిల్‌ 8న పోలింగ్‌ నిర్వహించేలా నోటిఫికేషన జారీ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ జరిగినా.. హైకోర్టు సింగిల్‌ బెంచ తీర్పుతో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆరు నెలల తరువాత హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓకే చెప్పడంతో ఎన్నికలు జరిగిన మండలాల్లో ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టరు, జాయింట్‌ కలెక్టర్లు పరిశీలించారు.


ఓట్ల లెక్కింపు ఇలా

జిల్లాలో 26 మండలాల్లో ఎన్నికలు జరిగితే 12 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు, 14 మండలాల్లో  కేవలం ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే పోలింగ్‌ జరిగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోలింగ్‌ జరిగిన మండలాల్లో ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను విడదీసి 25 ఓట్ల చొప్పన కట్టలు కడతారు. ఆ కట్టలను వేరువేరు డ్రమ్ముల్లో వేసి కలుపుతారు. తరువాత ఓట్ల లెక్కింపు చేస్తారు.. కేవలం ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నికలు జరిగిన మండలాల్లో 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టి.. ఓ డ్రమ్ములో వేసి కలిపి ఓట్లను లెక్కిస్తారు. అభ్యర్థితో పాటు ఆయన నియమించుకున్న కౌంటింగ్‌ ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఇస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన అమల్లో ఉంది. 


ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే

- బద్వేలు - బాలయోగి గురుకులంలో 3 మండలాలు: బద్వేలు, గోపవరం, పోరుమామిళ్ల

- జమ్మలమడుగు - ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 5 మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం

- ప్రొద్దుటూరు - ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2 మండలాలు: ప్రొద్దుటూరు, రాజుపాలెం

- రాజంపేట - అన్నమాచార్య కాలేజీ ఆఫ్‌ ఎడ్యుకేషనలో 2 మండలాలు: రాజంపేట, నందలూరు

- రైల్వేకోడూరు - అనంతరాజుపేట హార్టికల్చర్‌ రీసర్చ్‌ కేంద్రంలో 3 మండలాలు: రైల్వేకోడూరు, పెనగలూరు, చిట్వేలి

- అట్లూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం : అట్లూరు

- బి.మఠం జడ్పీ హైస్కూలు

- చాపాడు ఎంపీడీఓ ఆఫీస్‌

- దువ్వూరు ఎంపీడీఓ ఆఫీస్‌

- కలసపాడు జడ్పీ హైస్కూల్‌

- ఖాజీపేట ఎంపీడీఓ ఆఫీస్‌

- లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ ఆఫీస్‌

- పెండ్లిమర్రి ఎంపీడీఓ ఆఫీస్‌

- వల్లూరు ఎంపీడీపీ ఆఫీస్‌

- ఎర్రగంట్ల జడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌

- కమలాపురం ఎంపీడీవో కార్యాలయం


పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం

- మన్నూరు సుధాకర్‌రెడ్డి, జడ్పీ సీపీఓ, కడప

జిల్లాలో ఎన్నికలు జరిగిన 117 ఎంపీటీసీ స్థానాలకు 372 మంది, 12 జడ్పీటీసీ స్థానాలకు 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత ఏప్రిల్‌ 8న జరిగిన పోలింగ్‌లో 3,05,074 ఓట్లు పోలయ్యాయి. వాటి లెక్కింపు కోసం 16 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు  చేశాం. 713 మంది సిబ్బందిని నియమించాం. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. 144 సెక్షన అమల్లో ఉంటుంది.


మండలాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాలు, అభ్యర్థులు, పోలైన ఓట్ల వివరాలు

----------------------------------------------------------------------------------------------

మండలం ఎంపీటీసీ అభ్యర్థులు జడ్పీటీసీ అభ్యర్థులు లెక్కించే ఓట్లు

----------------------------------------------------------------------------------------------

బద్వేలు 1 3 1 8 10,898

గోపావరం 4 15 1 6 10,058

పోరుమామిళ్ల 2 9 1 7 18,642

జమ్మలమడుగు 9 32 1 5 18,281

కొండాపురం 9 30 1 2 19,631

ముద్దనూరు 10 29 1 2 19,063

మైలవరం 11 31 1 4 25,529

పెద్దముడియం 5 12 1 2 18,804

చిట్వేలి 10 36 1 3 21,420

రైల్వే కోడూరు 10 30 1 6 32.976

పెనగలూరు 5 11 1 2 18.281

నందలూరు -- -- 1 2 21.509

అట్లూరు 1 3 -- -- 1,151

కలసపాడు 5 14 -- -- 8,729

ఎర్రగుంట్ల 4 11 -- -- 6,928

కమలాపురం 2 4 -- -- 2,465

పెండ్లిమర్రి 1 2 -- -- 983

వల్లూరు 1 2 -- -- 638

బి.మఠం 1 2 -- -- 2,163

చాపాడు 3 13 -- -- 5,582

దువ్వూరు 3 11 -- -- 5,199

ఖాజీపేట 2 7 -- -- 4,967

ప్రొద్దుటూరు 7 27 -- -- 13,594

రాజుపాలెం 4 9 -- -- 7,142

రాజంపేట 6 27 -- -- 9,719

లక్కిరెడ్డిపల్లి 1 2 -- -- 722

------------------------------------------------------------------------------------------

మొత్తం 117 372 12 49 3,05,074

------------------------------------------------------------------------------------------

Updated Date - 2021-09-19T05:46:25+05:30 IST