చైనా ఎఫెక్ట్: ప్రపంచ దేశాలకు కొత్త తలనొప్పి!

ABN , First Publish Date - 2020-04-10T03:04:55+05:30 IST

కరోనాతో పోరాడుతున్న అనేక దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఓ ప్రధానమైన సమస్య.. వైద్య పరికారాలు, రక్షన దుస్తుల కొరత. వీటి ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు చైనా కంపెనీలను కూడా ఆశ్రయిస్తున్నాయి. ఈ నిర్ణయమే వాటికి తలనొప్పులు తెస్తోంది.

చైనా ఎఫెక్ట్:  ప్రపంచ దేశాలకు కొత్త తలనొప్పి!

న్యూఢిల్లీ: కరోనాతో పోరాడుతున్న అనేక దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఓ ప్రధానమైన సమస్య.. వైద్య పరికారాలు, రక్షణ దుస్తుల కొరత. వీటి ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు చైనా కంపెనీలను కూడా ఆశ్రయిస్తున్నాయి. ఈ నిర్ణయమే వాటికి తలనొప్పులు తెస్తోంది. చైనా ఉత్పత్తులకు ఆరోగ్య సిబ్బంది వినియోగించేంతటి నాణ్యత లేదని అధికారులకు ఆ దిగుమతుల్ని పరిశీలించిన మీదటగానీ తెలియడం లేదు. దీంతో మరో దారిలేని పరిస్థితుల్లో అక్కడి అధికారులు వీటిని చైనాకు తిప్పి పంపిస్తున్నారు.


ఇటువంటి సమస్య ఎదుర్కొన్న దేశాల జాబితాలోకి తాజాగా ఫిన్ ల్యాండ్ కూడా వచ్చి చేరింది. చైనా నుంచి తెప్పించుకున్న 2 మిలియన్ మాస్కులను, 2.3 లక్షల రెస్పిరేటర్ మాస్కులకు వైద్య సిబ్బంది వాడేంతటి నాణ్యత లేదని తెలిసి ఫిన్‌ల్యాండ్ ప్రభుత్వం చైనాపై మండిపడింది. నాసిరకం ఉత్పత్తులను సరఫరా చేస్తోందంటూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వీటిని సామాస్య ప్రజల కోసం వినియోగించే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.


వాస్తవానికి ఫిన్ ల్యాండ్‌లో రోజుకి అర మిలియన్ మాస్కులు, 50 వేల రెస్పిరేటర్ల మాస్కులు అవసరమవుతాయి. వీటి ఉత్పత్తి కోసం మూడు స్వదేశీ కంపెనీలను సంప్రదించడంతో పాటూ చైనా కంపెనీలకు కూడా అక్కడి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. అయితే చైనా ఉత్పత్తుల్లో ఆశించిన నాణ్యత కనిపించకపోవడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


కాగా ఇటీవల స్పెయిన్, నెదర్‌ల్యాండ్స్, టర్కీ, ఆస్ట్రేలియా దేశాలు కూడా చైనా ఉత్పత్తులను తిరస్కరించాయి. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం తప్పు సరిదిద్దుకోకుండా వితండవాదానికి దిగుతోంది. ఈ ఉత్తత్తులు వైద్య సిబ్బంది కోసం ఉద్దేశించినవి కావని ముందే చెప్పామని, ఆర్డర్ చేసిన ప్రభుత్వాలు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోలేదని చైనా విదేశాంగ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-10T03:04:55+05:30 IST