ఆ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ రైల్వే స్టేషన్‌ను నడుపుతున్నది ఎవరో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2021-12-23T22:23:38+05:30 IST

రాజస్థాన్‌లోని జస్లూ నానక్ రైల్వే స్టేషన్.. ఈ స్టేషన్‌ నుంచి ఆదాయం రావడం లేదని రైల్వే శాఖ 2005లో దానిని మూసేసింది..

ఆ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ రైల్వే స్టేషన్‌ను నడుపుతున్నది ఎవరో తెలిస్తే షాకవడం ఖాయం!

రాజస్థాన్‌లోని జస్లూ నానక్ రైల్వే స్టేషన్.. ఈ స్టేషన్‌ నుంచి ఆదాయం రావడం లేదని రైల్వే శాఖ 2005లో దానిని మూసేసింది.. దాంతో ఆ ఊరి ప్రజలు స్టేషన్ ఎదురుగా ధర్నా చేశారు.. చివరకు రైల్వే శాఖ దిగి వచ్చి ఓ ప్రతిపాదన పెట్టింది.. నెలకు 1500 టిక్కెట్లు అమ్ముడయ్యేలా చూస్తే ఆ స్టేషన్‌లో రైళ్లను ఆపుతామని చెప్పింది.. దీంతో అప్పట్నుంచి గ్రామ ప్రజలు చందాలు వేసుకుని మరీ ఆ రైల్వే స్టేషన్‌ను నడుపుతున్నారు. 


జస్లూ నానక్ గ్రామంలో సైనికులు ఎక్కువ. దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బీఎస్‌ఎఫ్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారు. ఆ గ్రామంలో 45 సంవత్సరాల క్రితం 1976లో రైల్వే శాఖ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే తక్కువ ఆదాయం వస్తోందనే కారణంతో అక్కడ స్టాపింగ్ తీసెయ్యాలని 2005లో నిర్ణయించింది. ఈ నిర్ణయంపై గ్రామస్థులు మండిపడ్డారు. 11 రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రైల్వే శాఖ ఓ ప్రతిపాదన పెట్టింది. రోజుకు 50 చొప్పున నెలకు 1500 టిక్కెట్లు అమ్ముడయ్యేలా చూడాలని చెప్పింది. దానికి గ్రామస్థులు అంగీకరించారు. 


ప్రతి నెల చందాలు వేసుకుని ఒకేసారి 1500 టిక్కెట్లు కొనేస్తారు. అనంతరం స్టేషన్‌లోనే ఒక వ్యక్తిని పెట్టి పాసింజర్లకు అమ్ముతుంటారు. ఆ వ్యక్తికి గౌరవ వేతనం కింద నెలకు రూ.5000 చెల్లిస్తున్నారు. ఇలా 17 ఏళ్లుగా రైల్వేకు నెలకు దాదాపు 30 వేల రూపాయల ఆదాయం సమకూరుస్తున్నారు. ఆ స్టేషన్‌లో రోజుకు పది రైళ్లు ఆగుతుంటాయి. ఆ రైల్వే స్టేషన్‌లో గ్రామస్థులే పలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కూర్చునేందుకు కుర్చీలు, తాగు నీరు ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో ప్రజలు నడుపుతున్న రైల్వే స్టేషన్ ఇదొక్కటే కావడం గమనార్హం. 


Updated Date - 2021-12-23T22:23:38+05:30 IST