Abn logo
Sep 19 2021 @ 16:28PM

పోలీసు ఉద్యోగం కోసం భర్తతో కలిసి ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరిన భార్య.. విధి చిన్నచూపు చూడటంతో..

ఇంటర్నెట్ డెస్క్: పోలీస్ ఉద్యోగం సాధించడం ఆమె కల. పెళ్లైనప్పటికీ ఆమె తన లక్ష్యాన్ని వదిలేయలేదు. తన మనసులోని మాటను భర్తకు చెప్పి, ఆయన సహకారంతో రాత్రి పగలు తేడా లేకుండా ప్రిపేర్ అయింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దీంతో ఆ మహిళ తన భర్తతో కలిసి.. ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరింది. అయితే ఆ జంటను విధిని చిన్న చూపు చూసింది. దీంతో ఎగ్జామ్ సెంటర్‌ వద్దకు వెళ్లాల్సిన ఆ దంపతులు.. విఘత జీవులుగా ఆసుపత్రికి చేరారు. అసలేం జరిగిందంటే..


హర్యానాకు చెందిన 23ఏళ్ల స్వప్నకు పోలీసు ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉండేంది. కాగా.. ఆమెకు 2018లో నవీన్ అనే వ్యక్తితో విహాహం జరిగింది. ఈ క్రమంలో తన మనసులో మాటలను స్వప్న తన భర్తకు చెప్పింది. దీంతో నవీన్ కూడా స్వప్నకు అండగా నిలిచాడు. రాజస్థాన్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్యను ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలోనే వారికి మొదటగా ఓ పాప పుట్టింది. అనంతరం నాలుగు నెలల క్రితం ఆ దంపతులు ఓ బాబుకు కూడా జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే.. స్వప్న ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చింది. దీంతో ఓ పక్క పిల్లలను చూసుకుంటూనే మరో పక్క తన ప్రిపరేషన్‌ను కొనసాగించింది స్వప్న. ఈ నేపథ్యంలోనే యమునానగర్‌లో ఎగ్జామ్ సెంటర్ పడటంతో.. ఒక రోజు ముందుగానే స్వప్న తన భర్తతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. నాలుగు నెలల కొడుకును తమ కుటుంబ సభ్యుల దగ్గర వదిలేసి.. ఆ దంపతులిద్దరూ రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో విధి వారిని చిన్న చూపు చూసింది. దీంతో ఢిల్లీ-జైపూర్ హైవేపై వెనకనుంచి వచ్చిన లారీ.. వారు ప్రయాణిస్తున్న బైకును బలంగా ఢీ కొట్టడంతో ఆ దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...