Abn logo
Aug 12 2021 @ 13:35PM

పోలీస్ స్టేషన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా: కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్యాయత్నానికి దారి తీశాయి. నందిగామ పోలీస్ స్టేషన్ ఎదుట భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. చందర్లపాడు మండలం పొక్కునూరుకు చెందిన అనిల్ కుమార్.. నాలుగేళ్ల క్రితం ఒరిస్సాకి చెందిన స్వప్నను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మరింత ఎక్కువ అవడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. భరించలేని స్వప్న నందిగామ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగింది. ఆమె చేతిలో ఉన్న డబ్బాను అనిల్ లాక్కుని, తాను కూడా తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం నందిగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.