లాక్‌డౌన్‌తో ఉపాధి లేక దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-11T15:44:42+05:30 IST

లాక్‌డౌన్‌తో ఉపాధి కరవవ్వడంతో తట్టుకోలేక ఓ ఆటోడ్రైవర్‌.. భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిండుగల్‌ జోసఫ్‌ కాలనీకి చెందిన దంపతులు ఆటోడ్రైవర్

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక దంపతుల ఆత్మహత్య

చెన్నై: లాక్‌డౌన్‌తో ఉపాధి కరవవ్వడంతో తట్టుకోలేక ఓ ఆటోడ్రైవర్‌.. భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిండుగల్‌ జోసఫ్‌ కాలనీకి చెందిన దంపతులు ఆటోడ్రైవర్‌ మోహన్‌ (56), విజయ (51)కు ఓ కుమార్తె ఉంది. కుమార్తె వివాహమై వేరే ప్రాంతంలో ఉండడంతో వారు ఒంటరిగా జీవిస్తున్నారు. దిలా ఉంటే లాక్‌డౌన్‌తో నాలుగు నెలలుగా మోహన్‌ ఆటోకు వెళ్లలేదు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వారి ఒత్తిడితో వారు మనస్తాపం చెందారు. గురువారం సాయంత్రం ఎస్‌ఎస్‌ నగర్‌లోని తమ్ముడు వీరమణికి ఫోన్‌ చేసిన మోహన్‌, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. వీరమణి సర్దిచెప్పేలోపు ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో ఆయన హుటాహుటిగా వారి ఇంటికి వెళ్లి చూడగా ఆ దంపతులు అపస్మారక స్థితిలో పడివుండడం గమ నించి వెంటనే దిండుగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిండుగల్‌ దక్షిణం పోలీ సులు మోహన్‌ ఇంట్లో తనిఖీ చేయగా, సగం కోసి జామకాయ, మోహన్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు, ఇందులో ఎవరి ప్రమేయం లేదని ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2020-07-11T15:44:42+05:30 IST