టోక్యోలో జంటలు

ABN , First Publish Date - 2021-07-20T09:16:59+05:30 IST

గత రెండు ఒలింపిక్స్‌లో సింగిల్‌గా బరిలో దిగిన భారత ఆర్చర్‌ దీపికా కుమారి.. ఈసారి భర్త అతాను దాస్‌తో కలిసి పాల్గొంటోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అథ్లెట్లు జోడీగా టోక్యో క్రీడల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీరిలో కొందరు భార్యాభర్తలు కాగా.. మరి కొందరు ప్రేమికులు...

టోక్యోలో జంటలు

గత రెండు ఒలింపిక్స్‌లో సింగిల్‌గా బరిలో దిగిన భారత ఆర్చర్‌ దీపికా కుమారి.. ఈసారి భర్త అతాను దాస్‌తో కలిసి పాల్గొంటోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అథ్లెట్లు జోడీగా టోక్యో క్రీడల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీరిలో కొందరు భార్యాభర్తలు కాగా.. మరి కొందరు ప్రేమికులు. 


తారా డేవి‌స్ -హంటర్‌ వుడ్‌హాల్‌

అమెరికాకు చెందిన వీరిద్దరూ జంటగానే టోక్యోకు చేరుకున్నారు. మహిళల లాంగ్‌ జంప్‌లో డేవిస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. పారాలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో హంటర్‌ తలపడనున్నాడు. 







దీపిక- అతాను

ఒకే ఈవెంట్‌లో భార్యాభర్తలుగా ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్న తొలి భారత జంట దీపిక, అతాను. గతేడాది వీరి వివాహం జరిగింది. రికర్వ్‌ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో టాప్‌ ర్యాంకర్‌ అయిన దీపిక.. పతకమే లక్ష్యంగా మూడోసారి విశ్వక్రీడల బరిలో నిలుస్తోంది. ఇక అతాను తొలిసారి మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు. మిక్స్‌డ్‌ విభాగంలో వీరిద్దరూ పతకం తీసుకొస్తారనే అంచనాలున్నాయి. 


శాండీ-టైరోన్‌

అమెరికా జంపింగ్‌ జోడీ శాండీ మోరిస్‌, టైరోన్‌ స్మిత్‌. శాండీ పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ కాగా.. స్మిత్‌ లాంగ్‌ జంప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 2019 నుంచి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారు. 






లారా-జాసన్‌

ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ సైక్లింగ్‌ జోడీ లారా, జాసన్‌ కెన్నీ. 2016లో వివాహం చేసుకున్నారు. విశ్వ క్రీడల్లో విజయవం తమైన జోడీగా పేరు తెచ్చుకున్న వీరి వద్ద 10 ఒలింపిక్‌ స్వర్ణాలుండడం విశేషం. 





మేగన్‌- సు బర్డ్‌

అమెరికా మహిళా సాకర్‌ టీమ్‌ ప్లేయర్‌ మేగన్‌, యూఎస్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి సు బర్డ్‌ గతేడాది ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. వీరిద్దరూ ఈసారి తమ క్రీడా విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు.


చార్లెట్‌ కాస్లిక్‌-లూయిస్‌ హాలెండ్‌

ఆస్ట్రేలియా రగ్బీ కపుల్‌ చార్లెట్‌, లూయిస్‌. ఆసీస్‌ మహిళలు, పురుషుల రగ్బీ జట్ల తరఫున వీరు బరిలోకి దిగుతున్నారు. నిరుడు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

Updated Date - 2021-07-20T09:16:59+05:30 IST