మనోధైర్యమే మందు

ABN , First Publish Date - 2020-08-13T11:37:56+05:30 IST

‘ఆక్సిజన్‌ అయిపో యి తెల్లవారుజామున మూడున్నర గంటలకు మృత్యుఒడిలోకి జారిపోతున్నట్లు అనిపించింది. ఆ పరిస్థితిలో నన్ను చూసిన నా సతీ

మనోధైర్యమే మందు

అదే నన్ను,నా కుటుంబ సభ్యులను కాపాడింది

దేహానికి వైద్యం.. ఆత్మకు స్థైర్యం

ఈ అనుభవం కొత్త పాఠాలు నేర్పింది

ప్రభుత్వ వైద్యుల సేవలు వెలకట్టలేనివి

కొవిడ్‌ను జయించిన జడ్పీ సీఈవో

కైలాస్‌ గిరీశ్వర్‌ మనోగతం


ఒంగోలు (జడ్పీ), ఆగష్టు 12: ‘ఆక్సిజన్‌ అయిపో యి తెల్లవారుజామున మూడున్నర గంటలకు మృత్యుఒడిలోకి జారిపోతున్నట్లు అనిపించింది. ఆ పరిస్థితిలో నన్ను చూసిన నా సతీమణి ఒక్కసారిగా కుప్పకూలింది. నా కూతుళ్లు ఏమి చేయాలో తోచక రోదిస్తున్న వేళ ఏదో అద్భుతశక్తి మృత్యువు నుంచి నన్ను బయటపడేసింది. ఆ సమయంలో వచ్చి నాకు ఆక్సిజన్‌ అందించిన ఆపరేటర్‌ నాకు దేవుడిలాగానే కనపడ్డాడు. అప్పుడు అనిపించింది మనం కొలిచే దేవుళ్లు మనుషుల రూపంలోనే మనకు సాయం అందిస్తారని..


ఆ నిమిషం నాకు బలంగా అనిపిం చింది దైవం చేయాల్సింది చేసింది. ఇక మిగిలింది నా వంతే అని.. నేను ఆత్మస్థైర్యాన్ని నింపుకొని కరో నాను జయించటానికి సిద్ధమయ్యాను. వైద్యుల నిబ ద్ధతకు నా మనోనిబ్బరం తోడై కరోనాను జయించా ను. కోపతాపాలు, ఆవేశకావేశాలు, ఈర్ష్యాద్వేషాలు ఇవి ప్రతి వారిలో ఉండేవే. దానికి నేను కూడా అతీ తుడిని కాదు. వాటిలో హెచ్చుతగ్గులుంటాయంతే.  ఈ అనుభవం నన్ను నేను పూర్తిగా తరచి చూసుకు నేలా చేసింది. నాద్వారా ఎంతోమందికి సేవ చేయిం చాలన్నదే ఆ భగవత్సంకల్పం కావచ్చు’’ అని కరోనా ను జయించి తిరిగి బుధవారం విధుల్లోకి చేరి న జడ్పీ సీఈవో కైలాస్‌ గిరీశ్వర్‌ మాటలు. తన భార్య, ఇద్దరు కూతుళ్లు కూడా కొవిడ్‌-19 బారిన ప డ్డారని అందరం కోలుకొని ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. బుధవారం ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ...


దేహానికి వైద్యం ఆత్మకు స్థైర్యం

మందులు దేహానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ దానికి మన మనోనిబ్బరం తోడైతేనే దేన్నయినా  జయించగలం. కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని దానిని పారద్రోలాలంటే జాగ్రత్తగా ఉంటూ మనోనిబ్బరంతో ఉండాలని, నీవు నన్నేమి చేయలేవు అని కరోనాపై పరోక్ష యుద్ధం చేస్తే విజయం మనదే. 


ప్రభుత్వ వైద్యుల సేవలు అమోఘం

ఇలాంటి సంక్షోభ సమయంలోనే నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంది. కరోనాకు భయపడి ప్రైవేటు వైద్యులు వెన్నుచూపుతున్న వేళ మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యులు అందిస్తున్న సేవలు మాటలకందనివి. దాదాపుగా పదిరోజులపాటు వారు నాకుటుంబం పట్ల తీసుకున్న శ్రద్ధకు రుణపడి ఉం టాను. చాలామంది కరోనా బాధితులకు ప్రభుత్వ సేవల పట్ల కొన్ని అపోహల్లో ఉన్నారు. అవన్నీ నిజం కాదు. రిమ్స్‌లో వైద్యసేవలు అత్యద్భుతంగా ఉన్నాయి.


కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

నిత్యం నాక్షేమ సమాచారం తెలుసుకుంటూ నా కుటుంబానికి అండగా ఉన్న కలెక్టర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం విషయంపై వాక బు చేశారు. అంతేకాకుండా జడ్పీ సిబ్బంది కూడా పూర్తి సహాయసహకారాలు అందించారని ఆయన తెలిపారు.


సిబ్బంది ధైర్యం.. కోల్పోతారనే తెలియనివ్వలేదు

సిబ్బంది అందరితో పాటు పరీక్ష చేయించుకు న్నప్పుడు నెగెటివ్‌ వచ్చింది. తరువాత  ఈ నెల 1న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 2న రిమ్స్‌లో చేరాను. కానీ పాజిటివ్‌ అన్న విషయాన్ని గోప్యంగా ఉంచడా నికి ప్రధాన కారణం సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతిన కూడదనే. నాతో అంతకు ముందు సన్నిహితంగా మెలిగిన వారందరికి వ్యక్తిగతంగా తెలియపరచి వారు కూడా టెస్టులు చేయించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నాను.

Updated Date - 2020-08-13T11:37:56+05:30 IST