Abn logo
Sep 27 2021 @ 00:56AM

ధీర వనిత

దొంగలను అడ్డుకున్న స్వరూప

 దొంగలను ధైర్యంగా అడ్డుకున్న మహిళ 


రామకుప్పం, సెప్టెంబరు 26: రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె సమీపంలో ఇంట్లో పడిన దుండగులను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆపై ఆమె భర్త రావడంతో వారు పరారయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటాక వైసీపీ నేత మధుసూదన్‌రెడ్డి ఇంట్లో తలుపు వద్ద శబ్దం వచ్చింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆయన భార్య స్వరూపకు మెలకువ వచ్చి చూడగా తలుపులు బద్దలు కొట్టిన ముగ్గురు ముసుగు దొంగలు కత్తులు, ఇనుపరాడ్లతో ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. ఆమె ఽధైర్యంగా కత్తిపట్టుకున్న వ్యక్తి రెండు చేతులను గట్టిగా పట్టుకుని బిగ్గరగా కేకలు పెట్టారు. అతడి నుంచి కత్తి లాక్కోగా అతడు బయటకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు దొంగలు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉండగానే మేడపై నిద్రిస్తున్న మధుసూదన్‌రెడ్డి కిందకు రావడంతో వారూ పారిపోయారు. పోలీసులు, క్లూస్‌ టీం  సభ్యులు సంఘటనా స్థలిని పరిశీలించారు.