Abn logo
Dec 5 2020 @ 01:18AM

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

సంగారెడ్డి క్రైం, డిసెంబరు 4: ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి కోరారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో బ్యాంకు, ఇన్సూరెన్స్‌ అధికారులు, న్యాయవాదులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12న జరిగే లోక్‌ అదాలత్‌లో రోడ్డు ప్రమాదాలు, ఆస్తి, భూతగాదాలు, విద్యుత్‌ చౌర్యం, బ్యాంకు రికవరీ, భూ సేకరణ, వంటి కేసులను ఇరు పార్టీల రాజీ షరతుల ప్రకారం పరిష్కరించనున్నట్టు వివరించారు. అంతేగాక రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్‌ కేసులను, చెక్‌ బౌన్స్‌ కేసులను, భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలను ఇరు పార్టీలు రాజీచేసుకున్న పక్షంలో పరిష్కరించనున్నట్టు ఆయన చెప్పారు. దీని ద్వారా కక్షిదారుల సమయం వృఽథా కాకుండా వుంటుందన్నారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన ఆయాకోర్టు ప్రాంగణాల్లో సుమారుగా 15 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కక్షిదారులంతా ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.  సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  సీహెచ్‌ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.  


Advertisement
Advertisement