Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు.. కోర్టుకెక్కిన ఓ భర్త.. అసలు శారీరకంగానే కలవలేదంటూ షాకింగ్ నిజాలు..

అతను మిలిటరీ ఉద్యోగి.. 2006, మే 5వ తేదీన అతనికి వివాహం జరిగింది.. 2007, మార్చి 9వ తేదీన అతని భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఆ కొడుకు తనకు పుట్టలేదంటూ తాజాగా అతను కోర్టుకెక్కాడు.. డీఎన్‌ఏ టెస్ట్ జరిపించమని అభ్యర్థించాడు.. భార్య నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన అతను.. ఆ ప్రాసెస్ జరుగుతుండగానే ఈ పిటిషన్ కూడా దాఖలు చేశాడు.. అతడి పిటిషన్‌ను విచారించిన కేరళ హై కోర్టు డీఎన్‌ఏ టెస్ట్‌కు అనుమతినిచ్చింది. 


`నేను మిలిటరీలో పనిచేస్తున్నాను. నాకు 2006, మే 5వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే 22 రోజులపాటు నేను డ్యూటీకి వెళ్లిపోయాను. తిరిగి వచ్చిన తర్వాత కూడా నేను నా భార్యతో శారీరకంగా కలవలేదు. అలాగే, నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను తండ్రిని కావడం కష్టమని డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నా భార్యకు ఆమె అక్క భర్తతో ఎప్పట్నుంచో వివాహేతర సంబంధం ఉంది. అతడి వల్లే నా భార్యకు కొడుకు పుట్టాడ`ని పిటిషనర్ హైకోర్టుకు విన్నవించాడు. 


ఇవి కూడా చదవండి

రెడ్ సిగ్నల్ పడగానే రోడ్డుపైకి దూసుకొచ్చి ఓ యువతి అనూహ్య చర్య.. వీడియో వైరల్ కావడంతో కొత్త కష్టం..!బ్యాంకు ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అయినట్టు మెసేజ్.. మోదీ వేశారనుకుని ఖర్చు పెట్టేసిన తర్వాత..

తన ఇన్‌ఫెర్టిలిటీ సర్టిఫికెట్‌ను కూడా అందించాడు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు డీఎన్‌ఏ టెస్ట్‌కు అనుమతినిచ్చారు. కాగా, తన భార్య నుంచి విడాకులు కోరుతూ పిటిషనర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అది ట్రయల్ దశలో ఉండగానే తన భార్య కొడుక్కి తను తండ్రిని కాదని పేర్కొంటూ డీఎన్‌ఏ టెస్ట్ జరిపించాలని అభ్యర్థించాడు. అందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో అతడికి ఊరట లభించింది.  


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement