కోవిడ్‌కు భయపడి ఆన్‌లైన్‌లో వాదనలు వింటున్న కోర్టులు: మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2020-10-24T17:28:28+05:30 IST

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే జగన్ సర్కార్‌కు ముఖ్యమని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. కోవిడ్ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని కోర్టుకు ప్రభుత్వం తెలిపిందన్నారు. చంద్రబాబు, అచ్ఛెన్నాయుడుకి భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదనుకోవద్దన్నారు. వైద్యశాఖ అధికారులతో మాట్లాడి స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్‌కు భయపడి కోర్టు వాదనలు సైతం ఆన్ లైన్‌లో జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మంత్రి అజయ్ ముందుకొస్తే ... అది పెద్ద విషయం కాదు

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ముందుకొస్తే.. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడపటం పెద్ద విషయం‌ కాదన్నారు. బస్సులు నడిపే అంశంపై అధికారులు మధ్య చర్చలు కొలక్కి రావటం లేదన్నది తన ఉద్దేశమన్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్ ఆర్టీఎస్ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ బోర్డర్ వరకు బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు బస్సులు నడిపే అంశంపై స్నేహపూర్వక వాతావరణంలో ముందుకెళ్తున్నామన్నారు. జూన్ 18నుంచి టీఎస్ ఆర్టీసీతో చర్చలు జరుపుతున్నామన్నారు. లాభం కోసం కాకుండా.. పేదల కోసమే హైదరాబాద్‌కు బస్సులను నడపుతున్నామని తెలిపారు. 

రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికే భారీ జరిమానాలు

రోడ్డు ప్రమాదాలను నియంత్రించటానికే ఏపీలో భారీ జరినామాలు విధించాం. ఉద్దేశ పూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమణలకు పాల్పడేవారిని ఉపేక్షించమన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించేవారికి కొత్త చట్టంతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అడ్డగోలుగా డ్రైవింగ్ చేసేవారిని నియంత్రించటం కోసమే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. లైసెన్స్, బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ లేకుంటే ఒప్పుకునేది లేదన్నారు. రోడ్లపై గోతులకు, ఫైన్‌లకు సంబంధం లేదని, వర్షాలకు ఏపీలో రోడ్లు పాడైన మాట వాస్తవమని తెలిపారు.  

Updated Date - 2020-10-24T17:28:28+05:30 IST