95 శాతం కొవాగ్జిన్‌ ఖాళీ

ABN , First Publish Date - 2021-06-03T05:26:08+05:30 IST

జిల్లావ్యాప్తంగా 13 వేల కొవాగ్జిన్‌ డోసుల వ్యాక్సిన్‌ను సీవీసీలకు తరలించగా బుధవారం 95 శాతానికిపైగా నిల్వలు ఖాళీ అయ్యాయి.

95 శాతం కొవాగ్జిన్‌ ఖాళీ

వారంలో 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ !

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 2 : జిల్లావ్యాప్తంగా 13 వేల కొవాగ్జిన్‌ డోసుల వ్యాక్సిన్‌ను సీవీసీలకు తరలించగా బుధవారం 95 శాతానికిపైగా నిల్వలు ఖాళీ అయ్యాయి. పలుచోట్ల సెకండ్‌ డోస్‌కు రాకపోవడంతో వాక్సిన్‌ వృథా కాకుండా తొలిడోసుగా కూడా వేశారు. అక్కడక్కడ మిగిలిన వ్యాక్సిన్‌ నిల్వలతో గురువారం వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తారు. కొవిషీల్డ్‌ తొలి డోసు వేయించుకున్న లబ్ధిదారులకు ఇప్పట్లో రెండో డోసు వేయాల్సిన అవసరం లేనందున ఇక దిగుమతయ్యే నిల్వలను 45 ఏళ్ల వయస్సు పైబడిన వారితోపాటే, కొత్తగా ఇతర వయసుల వారికి పంపిణీ ప్రారంభించే అవకాశాలు న్నాయి. దీనిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటి వరకు ఏడు లక్షల 77 వేల 706 డోసుల టీకా మందు పంపిణీ చేయగా, ఇందులో తొలి డోసు 5 లక్షల 61 వేల 889 మందికి, రెండో డోసు 2 లక్షల 15 వేల 817 మందికి పంపిణీ చేశారు.


Updated Date - 2021-06-03T05:26:08+05:30 IST