‘కోవ్యాక్సిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఓకే

ABN , First Publish Date - 2020-06-30T07:51:17+05:30 IST

కరోనా నిరోధానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ ‘కోవ్యాక్సిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. కొవిడ్‌-19పై తయా రు చేసిన తొలి దేశీయ వ్యాక్సిన్‌ ఇదే...

‘కోవ్యాక్సిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఓకే

  • భారత్‌ బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్‌కు ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారం


హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కరోనా నిరోధానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ ‘కోవ్యాక్సిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. కొవిడ్‌-19పై తయా రు చేసిన తొలి దేశీయ వ్యాక్సిన్‌ ఇదే. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.


జంతువులపై నిర్వహించిన ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో నిరోధకశక్తి, భద్రతపై సానుకూల ఫలితాలు రావడంతో మానవులపై మొదటి, రెండో దశ ప్రయోగాలకు డ్రగ్‌ కం ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇం డియా(డీసీజీఐ) సోమవారం అనుమతినిచ్చింది. వచ్చేనెల నుంచి ప్రయోగాలు మొదలవుతాయి. ‘‘ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారం, జాతీయ నియంత్రణ ప్రొటోకాల్స్‌ను వేగిరం చేయడం వల్ల ప్రీ క్లినిక్‌ల్‌ అధ్యయనాన్ని త్వరగా పూర్తి చేశాం. హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీలోని బీఎ్‌సఎల్‌-3 ప్రమాణాల యూనిట్‌లో దీన్ని రూపొందించాం’’ అని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.

Updated Date - 2020-06-30T07:51:17+05:30 IST