‘కొవిడ్ కత్తి’

ABN , First Publish Date - 2021-05-16T05:34:32+05:30 IST

కొవిడ్ కత్తి ముక్కులో దూరుతుంది గొంతులోకి దిగుతుంది ఊపిరితిత్తుల్ని చీల్చుతుంది కత్తికి దయుండదు హృదయముండదు...

‘కొవిడ్ కత్తి’

కొవిడ్ కత్తి

ముక్కులో దూరుతుంది

గొంతులోకి దిగుతుంది

ఊపిరితిత్తుల్ని చీల్చుతుంది


కత్తికి

దయుండదు హృదయముండదు

నువ్వనీ లేదు, నేననీ లేదు

పల్లెనీ లేదు, పట్నమనీ లేదు

గొప్ప ప్రజాస్వామ్య లక్షణం

దాని వేగానికి హద్దు లేదు

వాదానికి తావు లేదు


కొవిడ్ కత్తి

చాలా చిన్నది

కంటికి కనిపించదు

‘విషాదమే’ చాలా పేద్డది


‘మృత్యు వైశాల్యం’ మరీ మరీ పెద్దది

వొంట్లోనూ ఇంట్లోనూ ఓపలేనంత

బతుకులో పట్టలేనంత

వారాల ఆనంద్

Updated Date - 2021-05-16T05:34:32+05:30 IST