4 కోట్ల కరోనా కేసులు.. 11 లక్షల ప్రాణాలు బలి

ABN , First Publish Date - 2020-10-20T10:44:57+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది. చైనాలో మొదలైన కరోనా నేడు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మార్కుని

4 కోట్ల కరోనా కేసులు.. 11 లక్షల ప్రాణాలు బలి

లండన్‌, అక్టోబరు 19: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది. చైనాలో మొదలైన కరోనా నేడు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మార్కుని దాటేసింది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం సోమవారం ఈ సంఖ్య 4.01 కోట్లకు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు 11 లక్షల మందికిపైగా చనిపోయారు. ఇవన్నీ ఆయా దేశాలు వెల్లడించిన అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాతోపాటు భారత్‌, బ్రెజిల్‌ ఎక్కువగా వైరస్‌ ప్రభావానికి గురయ్యాయి. అమెరికాలో 83.8 లక్షల కేసులు నమోదవగా.. భారత్‌లో 75 లక్షలు, బ్రెజిల్‌లో 52 లక్షల మందికి వైరస్‌ సోకింది. కాగా.. ఇటీవల కాలంలో యూర్‌పలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన వివరాల ప్రకారం ఐరోపా వ్యాప్తంగా గతవారం దాదాపు 7 లక్షల కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌తోపాటు రష్యాలోనూ కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉంది. దీంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.


Updated Date - 2020-10-20T10:44:57+05:30 IST