క‌రోనాతో అరిజోనా అత‌లాకుత‌లం..!

ABN , First Publish Date - 2020-07-05T13:28:08+05:30 IST

అమెరికాలోని కీలక రాష్ట్రం అరిజోనా మొత్తం కరోనా హాట్‌ స్పాట్‌గా మారింది. మొత్తం ఐసీయూలు నిండిపోయాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దీనిని ఆల్‌టైం రికార్డుగా తెలిపాయి. గురువారం ఒక్కరోజే 3 వేల పైచిలుకు, శుక్రవారం 4 వేల పైచిలుకు జనాభాకు పాజిటివ్‌ వచ్చిందని అరిజోనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

క‌రోనాతో అరిజోనా అత‌లాకుత‌లం..!

జూనియర్‌ ట్రంప్‌ స్నేహితురాలికి పాజిటివ్‌

వాషింగ్టన్‌, జూలై 4: అమెరికాలోని కీలక రాష్ట్రం అరిజోనా మొత్తం కరోనా హాట్‌ స్పాట్‌గా మారింది. మొత్తం ఐసీయూలు 91ు నిండిపోయాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దీనిని ఆల్‌టైం రికార్డుగా తెలిపాయి. గురువారం ఒక్కరోజే 3 వేల పైచిలుకు, శుక్రవారం 4 వేల పైచిలుకు జనాభాకు పాజిటివ్‌ వచ్చిందని అరిజోనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92 వేలకు చేరిందని తెలిపింది. మరోపక్క, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడి స్నేహితురాలు కింబెర్టీ గుల్ఫియోల్‌కి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె హోమ్‌ క్వారంటైన్‌ అయ్యారు. ఈ క్రమంలో జూనియర్‌ ట్రంప్‌నకు కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ వచ్చింది. అయినా ఆయన హోం క్వారంటైన్‌ అయ్యారు. న్యూయార్క్‌లో శుక్రవారం ఒక్కరోజే 918 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 3 మాసాలుగా లాక్‌డౌన్‌తో మూతబడిన ఇంగ్లాండ్‌లోని బార్లు, పబ్‌లు, సినిమా హాళ్లు శనివారం తెరుచుకున్నాయి. ప్రజల్లో భయాందోళనలను తొలగించేందుకు బ్రిటన్‌ యువరాజు విలియం స్థానిక పబ్‌కు వెళ్లి కొద్ది సేపు గడిపారు. ఇక, స్కాట్‌లాండ్‌, వేల్స్‌ దేశాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. పాకిస్థాన్‌ను కరోనా హడలెత్తిస్తోంది. మొత్తం కేసులు 2.25 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య 4,619కి చేరింది.  

Updated Date - 2020-07-05T13:28:08+05:30 IST