కేరళలో రెండింతలు కానున్న కరోనా కేసులు... కారణమిదే!

ABN , First Publish Date - 2021-08-07T17:07:04+05:30 IST

కేరళలో రానున్న రోజుల్లో కరోనా కేసులు రెండింతలు కానున్నాయి.

కేరళలో రెండింతలు కానున్న కరోనా కేసులు... కారణమిదే!

తిరువనంతపురం: కేరళలో రానున్న రోజుల్లో కరోనా కేసులు రెండింతలు కానున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఆర్ వాల్యూ ఒకటిని దాటి ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్ అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితుల గురించి మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 90 శాతం భాధితులు డెల్టా వేరియంట్ బారిపడ్డారనే విషయం జినోమ్ సీక్వెన్సింగ్ ద్వారా వెల్లడయ్యిందని అన్నారు. ఇటువంటి కేసులు త్వరగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో కరోనా కట్టడికి చేపడుతున్న ఆంక్షలను ఎత్తివేయలేమన్నారు. ప్రజలంతా కూడా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.  

Updated Date - 2021-08-07T17:07:04+05:30 IST