‘‘కోవిడ్-19 పై అవగాహన పెంచేందుకు గ్రామాల్లో ప్రచారం’’

ABN , First Publish Date - 2020-08-06T03:32:19+05:30 IST

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆ శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 ఎఫెక్ట్ పై అవగాహన సందేశ సూచనలను మెసేజ్ రూపంలో

‘‘కోవిడ్-19 పై అవగాహన పెంచేందుకు గ్రామాల్లో ప్రచారం’’

అమరావతి : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆ శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 ఎఫెక్ట్ పై అవగాహన సందేశ సూచనలను మెసేజ్ రూపంలో పంపుతామని, వీటన్నింటిని గ్రామాల్లో ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2 వేల జనాభా మించిన గ్రామ పంచాయతీలలో కనీసం ఐదు ప్రదేశాల్లో ప్లెక్సీ బ్యానర్లను పెట్టాలన్నారు. వాల్ రైటింగ్స్ రాయించాలన్నారు. సోషల్ ఆడిట్ డీఆర్పీలు, సీఆర్పీలను కోవిడ్ అవగాహన కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. చుట్టూ ఉన్నవాళ్లతోనూ మాస్క్ లు ధరించేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగులు పనిచేస్తున్న పని ప్రదేశాల్లో మాస్క్ లు ధరించి ఆ ఫొటోలను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. శుక్రవారం రోజు జరిగే రోజ్ గార్ మీటింగ్ లో ఈ విషయాన్ని చెప్పాలని సూచించారు. పీడీ డ్వామాలందరూ తగిన చర్యలు తీసుకొని మాస్క్ ధరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు.

Updated Date - 2020-08-06T03:32:19+05:30 IST