కొవిడ్‌-19 కొలువులు

ABN , First Publish Date - 2020-03-30T09:59:09+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి

కొవిడ్‌-19  కొలువులు

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

వైద్యులు, నర్సుల నియామకానికి నోటిఫికేషన్‌

ఈ ఏడాది పాసైన, రిటైరైన వారు కూడా అర్హులే

ఎంతమందినైనా తీసుకొనే అవకాశం!


హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి కలవారు ఏప్రిల్‌ 3లోగా  health.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంబంధిత కోర్సుల్లో ఈ ఏడాది పాస్‌ అయిన వారి నుంచి రిటైర్‌ అయిన వాళ్లవరకు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. స్పెషలిస్టు వైద్యునికి రూ.లక్ష, ఎంబీబీఎస్‌ వారికి రూ. 40 వేలు, ఆయుష్‌ వైద్యునికి రూ. 35 వేలు, స్టాఫ్‌ నర్సుకు రూ. 23 వేలు, ల్యాబ్‌ టెక్నిషియన్‌కు రూ. 17 వేల  వేతనం ఇవ్వనున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.


ఇప్పటికే ప్రభుత్వ బోధనాస్పత్రులకు అనుబంధంగా ఉన్న 18  చోట్ల అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో 1645 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అవి గాక తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే ఎంత మందిని నియమిస్తున్నారన్నది నోటిఫికేషన్‌లో ప్రకటించలేదు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఎంతమందినైనా తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-03-30T09:59:09+05:30 IST