533 జిల్లాల్లో 10 శాతం దాటిన పాజిటివిటీ రేటు

ABN , First Publish Date - 2021-05-12T17:57:10+05:30 IST

దేశంలో కోవిడ్ పరిస్థితుల‌కు సంబంధించిన నూత‌న...

533 జిల్లాల్లో 10 శాతం దాటిన పాజిటివిటీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితుల‌కు సంబంధించిన నూత‌న గ‌ణాంకాలు మ‌రింత భ‌య‌పెడుతున్నాయి. దేశంలో 700కు పైగా జిల్లాలు ఉండ‌గా, వీటిలోని 533 జిల్లాల‌లో పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉంది. ఈ విషయాన్ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే గత కొద్ది రోజులుగా క‌రోనా కేసులలో క్షీణత న‌మోద‌వుతోంది. మొత్తం 13 రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. 


ఆరు రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 50 వేల నుంచి  ఒక లక్ష మధ్య ఉంటోంది. 7 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 50 వేల కన్నా తక్కువ‌గా ఉంది. దేశం మొత్తం మీద‌ 37 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ  దేశంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నేష‌న‌ల్ పాజిటివిటీ రేటు 21 శాతంగా ఉంది. దేశంలోని 42  జిల్లాల్లో పాజిటివిటీ రేటు నేష‌న‌ల్ పాజిటివిటీ రేటు కంటే అధికంగా ఉంద‌న్నారు. అలాగే దేశంలోని 533 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉంద‌ని తెలిపారు.

Updated Date - 2021-05-12T17:57:10+05:30 IST