Abn logo
Nov 22 2020 @ 21:21PM

కత్రినా కైఫ్‌కు కరోనా టెస్ట్..

Kaakateeya

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన కత్రినా కైఫ్‌ కరోనా లక్షణాలతో ఏమైనా బాధపడుతుందా? టెస్ట్ చేయించుకోవడానికి అని అనుమానం కలుగుతుంది కదా..!. ఎందుకంటే నిన్నటి వరకు మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసిన కత్రినాకు సడెన్‌గా కరోనా టెస్ట్ అంటే ఆ మాత్రం అనుమానం రావడం సహజమే. అసలు విషయం ఏమిటంటే.. సినిమా షూటింగ్స్‌ స్టార్ట్ అయ్యే ముందు నటీనటులు, టెక్నిషియన్లు.. ప్రొటోకాల్‌ ప్రకారం కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనను షూట్‌ స్టార్ట్ చేస్తున్న ప్రతిఒక్కరూ పాటిస్తున్నారు. తాజాగా కత్రినా కైఫ్ కూడా పాటించింది. షూట్‌లో జాయిన్‌ కాబోతున్నట్లుగా తెలుపుతూ.. కరోనా టెస్ట్ చేయించుకున్నట్లుగా కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఈ టెస్ట్‌కు సంబంధించిన వీడియోని కూడా ఆమె షేర్‌ చేసింది. అంతే కాదు.. టెస్ట్ అనంతరం ఆమె నవ్వుతూ కనిపించింది. భయపడకుండా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.


Advertisement
Advertisement