8,381 టెస్టులు.. 360 కేసులు

ABN , First Publish Date - 2021-06-20T05:27:05+05:30 IST

జిల్లాలో కొత్తగా 360 మందికి కరోనా వైరస్‌ సోకింది.

8,381 టెస్టులు.. 360 కేసులు

4.30 శాతంగా పాజిటివ్‌ రేట్‌

కొవిడ్‌తో మరో ఐదుగురు మృతి


గుంటూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 360 మందికి కరోనా వైరస్‌ సోకింది. శనివారం ఉదయం వరకు 8,381 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 4.30 శాతంగా పాజిటివ్‌ రేట్‌ నమోదైంది. కొవిడ్‌ నుంచి 302 మంది గత 24 గంటల్లో కోలుకున్నారు. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 3,869కి దిగి వచ్చింది. కరోనాతో పోరాడుతూ అమరావతి, క్రోసూరు, తాడికొండ, వెల్దుర్తి, రేపల్లెలో ఒక్కొక్కరు చనిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కొత్తగా గుంటూరు నగరంలో 44, అమరావతిలో 25, చిలకలూరిపేటలో 15, యడ్లపాడులో 15, వినుకొండలో 11, రాజుపాలెంలో 10, గురజాలలో 10, అచ్చంపేటలో 9, బెల్లంకొండలో 1, గుంటూరు రూరల్‌లో 6, క్రోసూరులో 2, మంగళగిరిలో 8, మేడికొండూరులో 4, ముప్పాళ్లలో 7, పెదకాకానిలో 5, పెదకూరపాడులో 9, పెదనందిపాడులో 4, ఫిరంగిపురంలో 3, ప్రత్తిపాడులో 2, సత్తెనపల్లిలో 6, తాడేపల్లిలో 9, తాడికొండలో 1, తుళ్లూరులో 2, వట్టిచెరుకూరులో 2, దాచేపల్లిలో 9, దుర్గిలో 8, కారంపూడిలో 2, మాచవరంలో 1, మాచర్లలో 3, పిడుగురాళ్లలో 8, రెంటచింతలలో 5, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 4, ఈపూరులో 6, నాదెండ్లలో 7, నరసరావుపేటలో 9, నూజెండ్లలో 9, నకరికల్లులో 8, రొంపిచర్లలో 8, శావల్యాపురంలో 2, అమర్తలూరులో 1, భట్టిప్రోలులో 1, బాపట్లలో 5, చేబ్రోలులో 4, చెరుకుపల్లిలో 2, దుగ్గిరాలలో 4, కాకుమానులో 2, కర్లపాలెంలో 2, కొల్లిపరలో 3, కొల్లూరులో 2, నగరంలో 5, నిజాంపట్నంలో 6, పిట్టలవానిపాలెంలో 2, పొన్నూరులో 5, రేపల్లెలో 5, తెనాలిలో 8, చుండూరులో 2, వేమూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


ఫీవర్‌ సర్వే ఫలితాలు విడుదల

జిల్లాలో నిర్వహించిన ఫీవర్‌ సర్వే ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మొత్తం 16 లక్షల 64 వేల 669 కుటుంబాలు జిల్లాలో ఉండగా 16 లక్షల 23 వేల 57 కుటుంబాలను సర్వే చేసినట్లు పేర్కొన్నది. ఆయా కుటుంబాల్లో 7,960 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి 7,508 మందికి టెస్టులు చేయించామని తెలిపింది. వారిలో 781 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా మిగతా 5,030 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు వెల్లడించింది.  వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఆర్‌టీపీసీఆర్‌లోనే చేయాలని రెండు రోజుల క్రితం సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో మాత్రం యాంటిజెన్‌ విధానంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. శనివారం ఆర్‌టీపీసీఆర్‌లో 3,990 పరీక్షలు చేస్తే యాంటిజెన్‌లో 4,324 స్వాబ్‌లు సేకరించారు. శుక్రవారం కూడా ఆర్‌టీపీసీఆర్‌ కంటే 500 టెస్టులు అదనంగా యాంటిజెన్‌లోనే చేశారు. 



   


Updated Date - 2021-06-20T05:27:05+05:30 IST