182 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-07-31T05:28:36+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి రెండు నుంచి మూడుశాతం మధ్యన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు 7,845 మందికి టెస్టింగ్‌ జరగగా 182 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది.

182 మందికి కరోనా

2.32 శాతంగా పాజిటివ్‌ రేటు

కొవిడ్‌తో ముగ్గురి మృతి


గుంటూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి రెండు నుంచి మూడుశాతం మధ్యన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు 7,845 మందికి టెస్టింగ్‌ జరగగా 182 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. పాజిటివ్‌ శాతం 2.32 శాతంగా నమోదైంది. అచ్చంపేట, కారంపూడి, చేబ్రోలు మండలాలకు చెందిన ముగ్గురు కొవిడ్‌ బాధితుల ఆరోగ్యం విషమించి మృతి చెందారు. దీంతో క్రియాశీలక కేసులు 1,544కి చేరాయి. కొత్తగా గుంటూరు నగరంలో 39, నరసరావుపేటలో 13, తుళ్లూరులో 9, నూజెండ్లలో 8, తెనాలిలో 6, అమరావతిలో 4, అచ్చంపేటలో 1, గుంటూరు రూరల్‌లో 2, క్రోసూరులో 1, మంగళగిరిలో 4, మేడికొండూరులో 1, ముప్పాళ్లలో 1, పెదకాకానిలో 2, పెదకూరపాడులో 5, పెదనందిపాడులో 3, ప్రత్తిపాడులో 4, రాజుపాలెంలో 1, సత్తెనపల్లిలో 3, తాడేపల్లిలో 5, తాడికొండలో 2, వట్టిచెరుకూరులో 1, దాచేపల్లిలో 2, గురజాలలో 2, కారంపూడిలో 3, మాచవరంలో 3, పిడుగురాళ్లలో 4, రెంటచింతలలో 4, బొల్లాపల్లిలో 1, చిలకలూరిపేటలో 3, యడ్లపాడులో 3, ఈపూరులో 1, నాదెండ్లలో 3, నకరికల్లులో 2, వినుకొండలో 3, అమర్తలూరులో 3, బాపట్లలో 5, చేబ్రోలులో 2, చెరుకుపల్లిలో 3, కర్లపాలెంలో 4, కొల్లిపరలో 1, కొల్లూరులో 2, నగరంలో 1, నిజాంపట్నంలో 4, పిట్టలవానిపాలెంలో 4, పొన్నూరులో 2, రేపల్లెలో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


9,700 మందికి పైగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

 శుక్రవారం 45 ఏళ్ల వయస్సు దాటిన కేటగిరీకి చెందిన 3,707, ప్రవాస భారతీయులు 24, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు 2,277, గర్భిణులు 298, ప్రభుత్వ ఉపాధ్యాయులు 22, ప్రైవేటు టీచర్లు 23 కలిపి మొత్తం 6,351 మందికి కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసుని వేశారు. 3,487 మందికి రెండో డోసు టీకా కూడా చేసినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.


లక్ష్యం దాటిన టీకాల సంఖ్య

ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం జిల్లాలో కేంద్రం అనుమతించిన వివిధ కేటగిరీలకు చెందిన వారు 17,23,904 మంది ఉంటారని అంచనా. వీరిలో 15.005 లక్షల మంది 45 ఏళ్ల వయస్సు దాటిన వారు, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలున్న తల్లులు 1,86,434, గర్భిణులు 36,911 మంది ఉంటారని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 14.67 లక్షలు, ప్రవాస భారతీయులు 5,865, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు 2,54,341, గర్భిణులు 7,209, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2,111, ప్రైవేటు టీచర్లు 1,318 మంది కలిపి మొత్తంగా 17,38,327 మందికి తొలి డోసు టీకాని వేశారు. ఈ గణాంకాలు పరిగణనలోకి తీసుకొంటే ప్రభుత్వం వద్ద ఉన్న డేటా కంటే అదనంగా 14,423 మందికి అదనంగా టీకాలు వేసినట్లు స్పష్టమైంది. 

Updated Date - 2021-07-31T05:28:36+05:30 IST