రెండో రోజు.. 798 మందికి..

ABN , First Publish Date - 2021-01-18T05:11:31+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు ఎందుకనో కొంత మంది వైద్యసిబ్బంది వెనకడుగు వేస్తు న్నారు.

రెండో రోజు.. 798 మందికి..

కరోనా వ్యాక్సినేషన్‌ 43 శాతం..

జిల్లాలో 36,500 మందికి టీకాలు లక్ష్యం


గుంటూరు, పొన్నూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు ఎందుకనో కొంత మంది వైద్యసిబ్బంది వెనకడుగు వేస్తు న్నారు. టీకా వేయడం ప్రారంభమైన శనివారం 72శాతం పైగా వ్యాక్సిన్‌ చేయించుకోగా ఆదివారం ఈ శాతం గణనీయంగా తగ్గింది. మొత్తం 1,840 మందికి ఆదివారం వ్యాక్సినేషన్‌ జర గాల్సి ఉండగా వారిలో రాత్రి 7 గంటల సమయానికి కేవలం 798 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. పురోగతి శాతం 43గా నమోదైంది. అమరావతి లో 26, బాపట్లలో 40, దుగ్గిరాలలో 2, దుర్గిలో ఒకరు, యడ్లపాడులో 4, గుర జాలలో 18, కర్లపాలెంలో 5, కొల్లూరు లో 5, మాచవరంలో 2, మాచర్లలో 43, మంగళగిరిలో 27, నాదెండ్లలో 52, నరసరావుపేటలో 73, నిజాంపట్నంలో 38, పెదనందిపాడులో ఒకరు, నుదు రుపాడులో 64, మన్నవలో 63, గొట్టి పాడులో 71, రాజుపాలెంలో 69, రొంపి చర్లలో 3, ఫణిదంలో 42, శావల్యాపు రంలో 11, పొన్నెకల్లులో 39, తెనాలిలో 40, చుండూరులో 3, వినుకొండలో 6, గుం టూరు జీజీహెచ్‌లో 26, బొంగరా లబీడులో 10, శ్రీనివాసరావుతోటలో 14 మంది వ్యాక్సిన్‌ వేయించుకొన్నారు. 

 - జిల్లాలో 36,500మంది ఆరోగ్యసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలకు తొలివిడత కొవిడ్‌ టీకాలు వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు  డీఎం హెచ్‌వో డాక్టర్‌ వై.యాస్మిన్‌ తెలిపారు. పొన్నూరు మండలం మన్నవ ప్రాథ మిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని మునిపల్లె హెల్త్‌సబ్‌సెంటర్‌లో  ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఆదివారం శాసనమండలి చీఫ్‌విప్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిడోసు ఇచ్చిన వారిలో వినుకొండలోని శావల్యాపురం, దత్తలూరుకు చెందిన ఇద్దరికి స్వల్ప ఒళ్ళునొప్పులు ఉన్నట్లు గుర్తించి వారికి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కార్య క్రమంలో  డాక్టర్‌ కె.ఝాన్సీరాణి,  డాక్టర్‌ ఉమ్మా రెడ్డి వెంకటరమణ, డాక్టర్‌ రూత్‌రాణి తదితరులు పాల్గొన్నారు.   


కొత్తగా 19 మందికి కరోనా

జిల్లాలో కొత్తగా 19 కరోనా పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివా రం ఉదయం వరకు అందిన 3,139 ల్యాబ్‌ శాంపిల్స్‌ ఫలితాల్లో 0.61 శాతం మందికి పాజిటివ్‌, మిగతా 3,120 (99.39 శాతం) మందికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. గుంటూరు నగరం లో 6, నరసరావుపేటలో 3, ముప్పాళ్ల లో 2, దాచేపల్లిలో 2, మాచర్లలో 2, పెదనందిపాడు, నాదెండ్ల, కాకుమాను, పొన్నూరులో ఒక్కో పాజిటివ్‌ కేసు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 76,901 మంది కొవిడ్‌-19 బారిన పడగా వారిలో 75,890(98.68 శాతం) మంది కోలుకొన్నారు. ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతోండగా 731 (0.95 శాతం) మంది చనిపోయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ తెలి పారు. ఆదివారం 3,012 మంది కరోనా టెస్టులు చేయించుకొన్నారు. 


Updated Date - 2021-01-18T05:11:31+05:30 IST