May 17 2021 @ 01:30AM

ఫ్యాషన్‌... ట్రెండ్స్‌... నాకు తెలియదు!

సినిమాలు, ముఖ్యంగా పాటల్లో కాస్ట్యూమ్స్‌... ఎయిర్‌పోర్ట్‌ స్టయిల్స్‌... జిమ్‌, క్యాజువల్‌ వేర్‌... హిందీ హీరోయిన్‌ దిశా పటానీ ఏ డ్రస్‌ వేసుకున్నా ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. బీటౌన్‌ బ్యూటీల్లో ఫ్యాషనిస్ట్‌లుగా పిలవబడే కొందరిలో ఆమె ఒకరు. అయితే, తనకు ఫ్యాషన్‌... ట్రెండ్స్‌ గురించి తెలియదని దిశా పటానీ చెబుతున్నారు. ‘‘నాకు ఫ్యాషన్‌ గురించి తెలియదు. నిజం చెప్పాలంటే... మంచి దుస్తులు ధరిస్తా. 90 శాతం బాస్కెట్‌బాల్‌ షార్ట్స్‌లో ఉంటాను. అవి, జోర్డాన్స్‌ నా ఫేవరెట్‌. ఇక, నేనెప్పుడూ ఓవర్‌సైజ్‌ టీ-షర్టులు, చెప్పులు వేసుకోవడం కామన్‌. బయటకు వెళ్లేటప్పుడు సాధారణంగా నేనెలా ఉంటానో, అందుకు కొంచెం భిన్నంగా కనిపించడానికి ప్రయత్నిస్తా. ఫ్యాషన్‌, ట్రెండ్స్‌ గురించి ఆలోచించకుండా నాకు నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకుంటా. సినిమాలకు వచ్చేసరికి సౌకర్యవంతంగా ఉన్న దుస్తులకు ప్రాముఖ్యం ఇస్తా. పాటల్లో కొరియోగ్రఫీ, స్టెప్పులను బట్టి కాస్ట్యూమ్‌ సెలక్షన్‌ ఉంటుంది’’ అని దిశా పటానీ చెప్పుకొచ్చారు.