బీ అలర్ట్‌

ABN , First Publish Date - 2022-01-18T05:59:21+05:30 IST

జిల్లాలో కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పరిశీలిస్తే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య తక్కువే అయినప్పటికీ గతంతో పోలిస్తే కేసులు పెరుగుతున్నాయి.దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

బీ అలర్ట్‌

నేటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ

 కొవిడ్‌ సేవలపై ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశాలు

 ఏలూరుతోపాటు తాడేపల్లిగూడెం, భీమవరంలో సేవలు

రక్త పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిందే 

బాధితులకు తప్పని ఇక్కట్లు.. పండుగ ముగిసింది

కేసులు పెరిగే అవకాశం.. ప్రజల్లో మొదలైన ఆందోళన


జిల్లాలో కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పరిశీలిస్తే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య తక్కువే అయినప్పటికీ గతంతో పోలిస్తే కేసులు పెరుగుతున్నాయి.దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో సేవలందించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  


తాడేపల్లిగూడెం/ఏలూరు క్రైం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌, ఒమైక్రాన్‌లను సమర్ధవంతంగా ఎదు ర్కోవడానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఆసుపత్రులలో ప్రత్యేక పడకలను గుర్తించి ఆక్సిజన్‌ అందు బాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో 55 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సిద్ధంగా ఉంచారు. అన్ని పడకలకు ఆక్సిజన్‌ అందేలా చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఆసు పత్రి, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రుల తోపాటు మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను గుర్తిం చారు. కలెక్టర్‌ మిశ్రా ఇటీవల ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి తగిన సూచనలు ఇచ్చారు. ఆసుపత్రి అత్యవసర విభాగానికి సమీపంలో ప్రత్యేకంగా కొవిడ్‌ విభా గాన్ని ఏర్పాటు చేయించారు. ఇక్కడ బాధితులను వైద్యులు పరీక్షించి అవసరమైన వారికి ఆసుపత్రిలో చేర్పించడం, మిగి లిన వారికి మందులు ఇచ్చి హోం ఐసొలేషన్‌ కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం పది మంది బాధితులు ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందుతున్నా రు. జిల్లాలో శనివారం కరోనా పరీ క్షలు చేయించుకున్న వారిలో 90 మందికి పాజిటివ్‌ రాగా వీరిలో ఎక్కువ మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ముఖ్యంగా హైదరా బాదు, తమిళనాడు, బెంగళూరు, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారు 50 మందికిపైగానే ఉన్నారు. మిగిలిన వారు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ప్రాణాపాయ పరిస్థితి గాని, ఆక్సి జన్‌ అవసరమైన వారు గాని ఎవరూ లేరు. అందరూ ఆరో గ్యంగానే ఉన్నారని, కొందరు హోం ఐసొలేషన్‌లో ఉండగా, మిగిలిన వారు వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరి నట్టు చెబుతున్నారు. మంగళవారం నుంచి ప్రతీ రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయడానికి పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది.


కొవిడ్‌ బాధితులకు పరీక్షలేవి ? 

ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన కొవిడ్‌ బాధితులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోనే అన్నిరకాల వైద్య సేవలందుతున్నాయి. తాడేపల్లిగూడెం, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిం చాలంటే ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్ర యిం చాల్సి వస్తోంది. ప్రధానంగా కొవిడ్‌ బాధి తులకు వైరస్‌ ఇతర అవయవాలపై ప్రభా వం చూపిస్తే రక్త పరీక్షల ద్వారా బయ టపడు తుంది. అటువంటి పరీక్షలు నిర్వహించే సదుపా యాలు ఈ ప్రభుత్వాసుపత్రుల్లో లేవు. ప్రైవేటు ల్యాబ్‌లకు పంపుతున్నారు. దీనివల్ల కాలయాపన జరుగుతోంది. బాధి తులకు తక్షణ వైద్య సదుపాయం అందించలేకపోతున్నారు. మరోవైపు కొవిడ్‌ బాధితులు చేతి సొమ్ములు వదిలించుకో వాల్సి వస్తోంది. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. కొవిడ్‌కు సంబంధించి అవసరమైన అన్నిరకాల రక్తపరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చర్యలు చేపట్టాలి. సంక్రాంతి పండుగకు జనసమ్మర్థం అధికంగా ఉండడంతో.. ఇప్పుడు కొవిడ్‌ కేసులు రోజురోజుకు మరింత పెరిగే అవకాశాలున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


పాఠశాలల్లో కలకలం...నలుగురు టీచర్లకు పాజిటివ్‌

 ఏలూరు ఎడ్యుకేషన్‌ / రూరల్‌ జనవరి 17 : జిల్లాలోని సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో నలుగురు ఉపాధ్యా యులు, ఒక ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. దెందులూరు మండలం గోవిం దపురం ప్రాథమిక పాఠశాల, ఉండి మండలం కోలమూరు ఎంపీపీఎస్‌, చెరకువాడ జడ్పీ హైస్కూలు, కొవ్వూరు మండలం మద్దూరులంక ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక ఎల్‌ ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, ఒక స్కూల్‌ అసిస్టెం ట్‌లకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దెందులూరు మండలం గోప న్నపాలెం ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశా లలో మధ్యాహ్నభోజన పథకం కార్మికు రాలికి కరోనా సోకినట్టు సోమవారం వెల్ల డైన ల్యాబ్‌ పరీక్షల ఫలితాల్లో తేలినట్టు జిల్లా విద్యాశాఖ వర్గాలు వివరించాయి.


గుడివాకలంకలో మూడు కేసులు 

 ఏలూరు మండలంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత నెల కేవలం ఐదు కేసులు ఉండగా ఈ నెల 12కు పైగా రావడంతో ఆందోళన కలిగిస్తున్నది. గుడివాకలంకలో తాజాగా మూడు కేసు లు నమోదయ్యాయి. వీరిలో ఒకరు కోలుకోగా, ఇద్దరు చికిత్స పొందుతున్నా రు. కొవిడ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్‌ నిర్వహించారు. 


సీవీసీల్లో ఆక్సిజన్‌ సదుపాయం : కలెక్టర్‌

ఏలూరు సిటీ, జనవరి 17:జిల్లాలోని అన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్ల(సీసీసీ)లో నాణ్యమైన వైద్య సేవలతో పాటు ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొవిడ్‌ నియంత్రణ, వాక్సినేషన్‌, గృహ నిర్మాణం, ఓటీఎస్‌, ఉపాధి హామీ తదితర అంశాలపై సమీక్షించారు. వైరస్‌ మూడో దశ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో నివారణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. నియోజకవర్గస్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కనీసం 100 మంది నుంచి 200 పడకలు ఏర్పాటుతోపాటు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. వాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ నూరు శాతం పూర్తి చేయాలన్నారు. వచ్చే గురువారం ఓటీఎస్‌ మేళా నిర్వహించి మొత్తం లబ్ధిదారుల్లో 10 వేల మంది ఈ పథకం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 



Updated Date - 2022-01-18T05:59:21+05:30 IST