Tokyo Olympics: అథ్లెట్ గ్రామంలో ఫస్ట్ కొవిడ్ కేసు

ABN , First Publish Date - 2021-07-17T15:34:49+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో మొట్టమొదటి కొవిడ్ కేసు తాజాగా వెలుగుచూసింది...

Tokyo Olympics: అథ్లెట్ గ్రామంలో ఫస్ట్ కొవిడ్ కేసు

టోక్యో (జపాన్): టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో మొట్టమొదటి కొవిడ్ కేసు తాజాగా వెలుగుచూసింది. టోక్యోలోని అథ్లెట్ల గ్రామంలో ఓ అథ్లెట్ కు జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. గోప్యత దృష్ట్యా కరోనా సోకిన అథ్లెట్ పేరు, ఏ దేశానికి చెందిన వారనేది వెల్లడించడం లేదని టోక్యో ఒలింపిక్స్ క్రీడల సీఈవో తోషిరో ముటో చెప్పారు. ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో కరోనా కేసు వెలుగుచూడటంతో క్రీడకారులు ఆందోళన చెందుతున్నారు. టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడలు కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ప్రేక్షకులు లేకుండా కఠినతరమైన నిర్బంధం, నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన అథ్లెట్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నామని ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా చెప్పారు. 

Updated Date - 2021-07-17T15:34:49+05:30 IST