Karnataka: రాష్ట్రమంతటా హై అలర్ట్‌

ABN , First Publish Date - 2022-01-08T17:12:52+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆరు జిల్లాల్లో వందల్లో కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రమంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 8,449 మందికి కొవిడ్‌

Karnataka: రాష్ట్రమంతటా హై అలర్ట్‌

- కొత్తగా 8,449 కొవిడ్‌ కేసులు

- రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌కు పాజిటివ్‌ 


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆరు జిల్లాల్లో వందల్లో కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రమంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 8,449 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 6,812 మంది, మైసూరులో 219, దక్షిణకన్నడ 211, ఉడుపి 148, మండ్య 129, బెళగావి 114 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా హావేరి జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఐదు జిల్లాల్లో 10లోపు కేసులు నమోదు కాగా 18 జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. 505 మంది కోలుకోగా నలుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరుకు చెందినవారు ముగ్గురు కాగా దక్షిణకన్నడకు చెందినవారు ఒకరు ఉన్నారు. 30,113 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం బెంగళూరు మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులో బుధవారం రాత్రి జరిగిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశానికి హాజరైన ఆయన నలతగా ఉండడంతో గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశానికి గైర్హాజరయ్యారు. కొద్దిగా జ్వరం అనిపించడంతో ముందస్తుగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. చికిత్స పొందుతున్న అశోక్‌ను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఫోన్‌లో పరామర్శించారు. 

Updated Date - 2022-01-08T17:12:52+05:30 IST