మళ్లీ పెరుగుతున్న Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-02T18:02:47+05:30 IST

రాష్ట్రంలో బెంగళూరు కేంద్రంగా మూడో విడత కొవిడ్‌ వైరస్‌ ప్రబలుతోందని వెంటనే ఢిల్లీ తరహాలో నిబంధనలు జారీ చేయడమే అనివార్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో బెంగళూరులో ఏక్షణమైనా కఠిన

మళ్లీ పెరుగుతున్న Covid కేసులు

- వైరస్‌ నియంత్రణకు మరిన్ని కఠిన నిబంధనలు.. 

- ఆందోళన కలిగిస్తున్న ఒమైక్రాన్‌

- ఢిల్లీ తరహా బెంగళూరులోనూ అమలు 

- ప్రభుత్వానికి వైద్యనిపుణుల సిఫారసు

 

బెంగళూరు: రాష్ట్రంలో బెంగళూరు కేంద్రంగా మూడో విడత కొవిడ్‌ వైరస్‌ ప్రబలుతోందని వెంటనే ఢిల్లీ తరహాలో నిబంధనలు జారీ చేయడమే అనివార్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో బెంగళూరులో ఏక్షణమైనా కఠిన నిబంధనలు అమలులోకి రావచ్చునని తెలుస్తోంది. బెంగళూరులో గడిచిన నాలుగు నెలలుగా 200 దాకా కొవిడ్‌ కేసులు నమోదయ్యేవి. తాజాగా మూడు రోజులుగా 600కుపైగా కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని కొవిడ్‌ మూడో విడత టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అభిప్రాయపడింది. తాజాగా శనివారం మారుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలను సూచించింది. దేశంలోనే తొలి ఒమైక్రాన్‌ కేసు బెంగళూరులో బయటపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రాష్ట్రంలో 66 ఒమైక్రాన్‌ కేసులు నమోదు కాగా వీటిలో ఎక్కువ బెంగళూరులోనే ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చినవారే ఎక్కువమంది ఉండడం తెలిసిందే. శుక్రవారం ఒకేరోజు 23 మందికి ఒమైక్రాన్‌ నిర్ధారణ కాగా శనివారం మంగళూరుకు చెందిన ఇద్దరు దక్షిణాఫ్రికా నుంచి వెనుతిరిగి రాగా వారికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఇలా ఒమైక్రాన్‌ కేసులు కూడా దేశంలోనే ముంబై, ఢిల్లీ, చెన్నై తరహాలో బెంగళూరులోనూ అధికం కావడంతో చర్యలు వెంటనే ప్రారంభించాలని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. పాజిటివిటీ రేటు 1 శాతం కంటే తక్కువ ఉంటే ఎల్లో అలర్ట్‌గాను, 1-2 శాతం ఉంటే ఆరంజ్‌గాను, 2 శా తానికిపైగా ఉంటే రెడ్‌ అలర్ట్‌గా ప్రకటించి సదరు ప్రాంతాలలో కఠిన నిబంధనలకు వెనుకాడరాదని సూచించింది. డెల్టా వేరియంట్‌ రా ష్ట్రాన్ని కుదిపేసిందని, ప్రత్యేకించి బెంగళూరు ఆసుపత్రులలో పడకలు, అంబులెన్స్‌లు లభించలేదని ఇదే పరిణామం మూడో విడతలో కూడా ప్రబలే అవకాశం లేకపోలేదని ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సూచించింది. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు రోజూ 75 వేలకు పెంచాలని, క్లస్టర్‌లలో తప్పనిసరిగా జినోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్టింగ్‌లు జరపాలని, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మాల్స్‌, అపార్ట్‌మెంట్‌లతోపాటు జనసందడి ప్రాంతాలలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కొవిడ్‌ రెండో విడత డెల్టా వేరియంట్‌కంటే ఒమైక్రాన్‌ వేగవంతంగా ప్రబలుతుందని ఒకరిద్వారా ఎంతమందికైనా సోకవచ్చునని వైద్యనిపుణులు సూచించారు. తీవ్రలక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌లో గడపవచ్చునని అందరికీ సౌలభ్యాలు ఉండవని, వెంటనే కొవిడ్‌కేర్‌ సెం టర్‌లను తెరవాలని సూచించారు. 

Updated Date - 2022-01-02T18:02:47+05:30 IST