2 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-14T08:05:26+05:30 IST

రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోవడంతో యాక్టివ్‌ కేసులు 2 లక్షల మార్కుని దాటేశాయి. కరోనా మరణాలు కూడా 9 వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 96,446 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 22,399 మందికి కరోనా పా

2 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

కొత్తగా 22,399 మందికి పాజిటివ్‌

24 గంటల్లో 89 మంది మృత్యువాత.. 9 వేలు దాటేసిన కరోనా మరణాలు

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోవడంతో యాక్టివ్‌ కేసులు 2 లక్షల మార్కుని దాటేశాయి. కరోనా మరణాలు కూడా 9 వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 96,446 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 22,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కరోనాతో మరో 89 మంది మృతిచెందారని పేర్కొంది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 13,66,785కి, మొత్తం మరణాల సంఖ్య 9,077కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 3,372 మందికి వైరస్‌ సోకగా.. చిత్తూరులో 2,646, గుంటూరులో 2,141, అనంతపురంలో 2,080, విశాఖపట్నంలో 2,064, నెల్లూరులో 1,589, పశ్చిమ గోదావరిలో 1,576, ప్రకాశంలో 1,489, కడపలో 1,447, కర్నూలులో 1,365, కృష్ణాలో 910, విజయనగరంలో 986, శ్రీకాకుళంలో 824 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో 18,638 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం రికవరీలు 11,56,666కి చేరుకున్నాయి. కాగా.. కరోనాతో విశాఖపట్నం, విజయనగరంలో 11 మంది చొప్పున మృతిచెందగా.. చిత్తూరు, తూర్పుగోదావరిలో తొమ్మిది మంది చొప్పున, కృష్ణా, ప్రకాశంలో ఎనిమిది మంది చొప్పున, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడప, కర్నూల్‌లో, పశ్చిమగోదావరిలో నలుగురు చొప్పున, అనంతపురంలో ముగ్గురు చొప్పున చనిపోయారు.


Updated Date - 2021-05-14T08:05:26+05:30 IST