304 మందికి కరోనా

ABN , First Publish Date - 2022-01-24T06:29:33+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

304 మందికి కరోనా

విజయవాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 304 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,24,784కు పెరిగింది. మరణాల సంఖ్య అధికారికంగా 1,482 వద్ద నిలకడగానే ఉంది. ఇప్పటి వరకు 1,19,556 మంది కోలుకున్నారు. ఇంకా 3,746 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


బాపులపాడు పీహెచ్‌సీ సిబ్బందికి కరోనా

హనుమాన్‌జంక్షన్‌ : వైద్యసేవలు అందించాల్సిన వైద్య సిబ్బందినే కరోనా చుట్టుముట్టింది. బాపులపాడు పీహెచ్‌సీ వైద్యాధికారికి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో ఎనిమిది మందికి వైరస్‌ సోకింది. పీహెచ్‌సీలో పని చేస్తున్న మొత్తం 12 మంది వైద్య సిబ్బందిలో ప్రస్తుతం తొమ్మిది మంది కొవిడ్‌ బారినపడ్డారు. పీహెచ్‌సీలో తొలుత ఫార్మాసిస్ట్‌కు, ఆ తరువాత వైద్యాధికారికి పాజిటివ్‌ నమోదు కాగా, రెండు రోజుల క్రితం అక్కడ పనిచేసే హెల్త్‌ అసిస్టెంట్‌కి, ఆదివారం మరో ముగ్గురు స్టాఫ్‌ నర్సులకు, అటెండర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, సీహెచ్‌వోలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో కొందరు హోం క్వారంటైన్‌లో ఉండగా, మరి కొందరు చినఆవుటపల్లి వైద్యకళాశాలలో చిక్సిత పొందుతున్నారు.

Updated Date - 2022-01-24T06:29:33+05:30 IST