జీహెచ్‌ఎంసీ పరిధిలో 1645 కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-21T16:34:27+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో గురువారం కొత్తగా 1,645 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య వేలల్లో

జీహెచ్‌ఎంసీ పరిధిలో  1645 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ:  జీహెచ్‌ఎంసీ పరిధిలో గురువారం కొత్తగా 1,645 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటంతో పలు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యూపీహెచ్‌సీ కేంద్రాల్లో కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పదిరోజుల క్రితం వరకు ఖాళీగా దర్శనమిచ్చిన పలు కేంద్రాలు ప్రస్తుతం రద్దీగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువశాతం గ్రేటర్‌లో నమోదవుతుండటం విశేషం. ఒక్క కూకట్‌పల్లి పరిధిలోనే 405 కేసులు నమోదు కావడం గమనార్హం.


అత్యవసర కేసులు లేవ్‌..

మియాపూర్‌: కొవిడ్‌, ఒమైక్రాన్‌ను దృష్టిలో పెట్టుకుని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో రోగులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. మూడువారాలుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా  ఆస్పత్రికి మైల్డ్‌ కేసులు మాత్రమే వస్తున్నాయని, వారికి జాగ్రత్తలు, సూచనలతో పాటు మందుల కిట్లు అందజేస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఐసీయూలో చేరేంత తీవ్రత ఉన్న కేసులు లేవన్నారు.  ఆక్సిజన్‌ ఎమర్జెన్సీ కేసులు కూడా లేవన్నారు. కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే చికిత్స పొందుతున్నారని, వారిలో ఒక గర్భిణి ఉందని తెలిపారు.  


ఫోన్‌ చేస్తే.. ఇంటికే వచ్చి ఫిర్యాదు స్వీకరణ

కొవిడ్‌ వేళ పోలీసుల కొత్త బాట

లంగర్‌హౌస్‌: పోలీ్‌సస్టేషన్లలోనూ కరోనా తిష్ఠ వేస్తోంది. ఎందరో సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుల సంక్షేమం కోసం ఆసి్‌ఫనగర్‌ సబ్‌ డివిజన్‌ పరిధి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీ్‌సస్టేషన్‌కు ఒక్కరే రావాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. ఫోన్‌ చేస్తే ఇంటికే వచ్చి ఫిర్యాదు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-21T16:34:27+05:30 IST