పెరుగుతున్న C0vid కేసులు

ABN , First Publish Date - 2022-01-17T15:59:59+05:30 IST

పుదుచ్చేరి రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి సమీపంలో ఉన్న తమిళనాడులో కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో ప్రభు

పెరుగుతున్న C0vid కేసులు

                 - కఠిన ఆంక్షల అమలు తప్పదా ?


పుదుచ్చేరి: పుదుచ్చేరి రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి సమీపంలో ఉన్న తమిళనాడులో కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్‌, రాత్రి కర్ఫ్యూ వంటి అనేక చర్యలు తీసుకుంది. అయితే, పుదుచ్చేరిలో మాత్రం పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. పైగా ఒక్క సినిమా థియేటర్లకు మాత్రమే ఆంక్షలు విధించింది. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాల ప్రదర్శన సాగించాలన్న ఒకేఒక్క షరతుతో చేతులుదులుపుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయడం లేదు. పైగా అవసరమైనపుడు మాత్రమే పోలీసుల సహకారంతో ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సిన్లు వేస్తున్నారు. అంతకుమించి ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు. ఒకవైపు తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పతా కస్థాయిలో ఉన్నప్పటికీ పుదుచ్చేరిలో మాత్రం ఈ వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యలపై పెద్దగా దృష్టి సారించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా కఠిన చర్యలు తీసుకుని వైరస్‌ వ్యాప్తి కోసం ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-17T15:59:59+05:30 IST