రెండు రోజులుగా తగ్గుతున్న Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-29T16:09:57+05:30 IST

జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో రెండు రోజులు కరోనా కేసులు తగ్గుముఖం పట్టి డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయని వైద్యాధికారులు శుక్రవారం తెలిపారు. బళ్లారి తాలుకాలో 271, కురుగోడు 9, కంప్లి 20,

రెండు రోజులుగా తగ్గుతున్న Covid కేసులు

బళ్లారి(కర్ణాటక): జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో రెండు రోజులు కరోనా కేసులు తగ్గుముఖం పట్టి డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయని వైద్యాధికారులు శుక్రవారం తెలిపారు. బళ్లారి తాలుకాలో 271, కురుగోడు 9, కంప్లి 20, సండూరు 47, సిరుగుప్ప 29, దాదాపు 376 కేసులు నమోదు కాగా అందులో ఈ ఒక్కరోజు 458 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. అదేవిధంగా విజయనగర జిల్లాలో హోస్పేట 82, కూడ్లిగి 20, కొట్టూరు 10, హెచ్‌బి హళ్లి 84, హరప్పనహళ్లి 28, అడగళి 109 మొత్తం విజయనగర జిల్లాలో 333 కేసులు నమోదు కాగా అందులో 391 మంది డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. రెండు జిల్లాలో కలసి 709 కేసులు రాగా 849 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, ప్రజలు జాగ్రత్త వహిస్తే మరింత త్వరగా తగ్గుతాయని వారు తెలిపారు.

Updated Date - 2022-01-29T16:09:57+05:30 IST