పెనుబల్లిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-17T05:42:00+05:30 IST

పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 25పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

పెనుబల్లిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

 సీహెచ్‌సీలో 200, పీహెచ్‌సీలలో 100పరీక్షలు

 సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, మే16: పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 25పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.  రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డును ప్రారంభించనునన్నట్లు చెప్పారు. కొవిడ్‌ కేంద్రంలో చికిత్సం నిమిత్తం బెడ్స్‌ ఏర్పాటు, వైద్య సిబ్బంది, ఆక్సిజన్‌ సిలిండర్లు, అవసరమైన మందులు, రెమ్‌డెసివిర్‌ 

ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు.

మంత్రి కేటీఆర్‌ చొరవతో పరీక్షలు

కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల విషయమై మంత్రి కేటీఆర్‌తో చర్చించినట్లు ఎమ్మెల్యే సండ్ర చెప్పారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో రోజుకు 200, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో 100చొప్పున కరోనా పరీక్షలు చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను మంత్రి ఆదేశించారన్నారు.  ధాన్యం కొనుగోళ్లు, రవాణా విషయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించగా సంబంధిత అధికారులతో చర్చించి జాప్యం జరగకుండా చూడాలని చెప్పారన్నారు.

Updated Date - 2021-05-17T05:42:00+05:30 IST