వ్యాయామంతో కొవిడ్‌కు చెక్‌!

ABN , First Publish Date - 2021-04-20T18:13:20+05:30 IST

నిరంతర వ్యాయామంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉన్న వాళ్లనూ కొవిడ్‌ వదలడం లేదు. అయితే ఇలాంటి క్రమం తప్పక వ్యాయామం చేసేవారికి కొవిడ్‌ సోకినా, వారు కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే..

వ్యాయామంతో కొవిడ్‌కు చెక్‌!

ఆంధ్రజ్యోతి(20-04-2021)

నిరంతర వ్యాయామంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉన్న వాళ్లనూ కొవిడ్‌ వదలడం లేదు. అయితే ఇలాంటి క్రమం తప్పక వ్యాయామం చేసేవారికి కొవిడ్‌  సోకినా, వారు కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే....


క్రమం తప్పక వ్యాయామం చేసేవారు, లేదా రోజుకు 30 నిమిషాలకు తగ్గకుండా బ్రిస్క్‌ వాక్‌ చేసేవారు ఆ అలవాటు లేని వారి కంటే త్వరగా కొవిడ్‌ నుంచి కోలుకుంటారు. వ్యాయామం చేసే అలవాటు లేని వారికి కొవిడ్‌ సోకితే, ఐసియులో అడ్మిట్‌ అయ్యే అవకాశాలు ఆ అలవాటు ఉన్న వారి కంటే 1.73 రెట్టు ఎక్కువ. అలాగే కొవిడ్‌ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం కూడా 2.49 రెట్లు ఎక్కువ. 60 ఏళ్లు పైబడిన పెద్దలు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, దీర్ఘకాలం పాటు మంచానికే పరిమితమైనవాళ్లకు కొవిడ్‌ ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అడుగుపెట్టిన ప్రస్తుత సమయంలో, దీన్నుంచి రక్షణ పొందడం కోసం వీలైనంత మేరకు ఇంటి పట్టునే వ్యాయామం చేయడం మంచిది. వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయడం లేదా ప్రతి రోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాలకు తగ్గకుండా వేగంగా నడవడం దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.

Updated Date - 2021-04-20T18:13:20+05:30 IST