కొవిడ్‌ సర్టిఫికెట్‌ సవరణలకు కొత్త యాప్‌

ABN , First Publish Date - 2022-04-16T15:21:50+05:30 IST

కొవిడ్‌ సర్టిఫికెట్‌లో సవరణలకు ప్రత్యేక యాప్‌ పరిచయం చేశారు. రాష్ట్రంలో కరోనా నిరోధక టీకాలు వేయించుకున్న వారికి కొవిడ్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్లలోని వివరాల్లో అక్షర

కొవిడ్‌ సర్టిఫికెట్‌ సవరణలకు కొత్త యాప్‌

ఐసిఎఫ్‌(చెన్నై): కొవిడ్‌ సర్టిఫికెట్‌లో సవరణలకు ప్రత్యేక యాప్‌ పరిచయం చేశారు. రాష్ట్రంలో కరోనా నిరోధక టీకాలు వేయించుకున్న వారికి కొవిడ్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్లలోని వివరాల్లో అక్షర లోపాలున్న వాటిని సవరించేందుకు అనుమతివ్వాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించేలా అన్ని జిల్లాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డా.సెల్వవినాయగం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం కొవిన్‌ యాప్‌ను పరిచయం చేశారు.ఈయాప్‌లో పేరు, వయస్సు, గుర్తింపుకార్డునెంబర్లు సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు 104అనే నెంబరును సంప్రదించవచ్చు.


Updated Date - 2022-04-16T15:21:50+05:30 IST