మండలానికోకొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌

ABN , First Publish Date - 2020-08-04T10:01:23+05:30 IST

పరీక్షలు నిర్వహించకపోయినా కరోనా లక్షణాలుతో బాధపడుతున్న వారికి సత్వర వైద్యం కోసం జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ ..

మండలానికోకొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌

ఆంధ్రజ్యోతి విజయవాడ : పరీక్షలు నిర్వహించకపోయినా కరోనా లక్షణాలుతో బాధపడుతున్న వారికి సత్వర వైద్యం కోసం జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మండల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఉంటే.. మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని, వైరస్‌ వ్యాప్తి నివారణకు కృషి చేయవచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సోమవారం కలెక్టర్‌ ఇంతియాజ్‌ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ కంట్రోల్‌ రూమ్‌కు సంబం ధించి ప్రతి మండలానికి వైద్యాధికారి నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారని, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్‌, మున్పిపల్‌ కమిషనర్లు ఆయా మండలాల్లో గుర్తించిన రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


మండల కంట్రోల్‌  రూమ్‌ ఫోన్‌ నెంబర్లను గ్రామాల్లోని ప్రజలం దరికీ తెలిసేలా ప్రకటించాలన్నారు. కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకోకపోయిన వ్యాధి తీవ్ర లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధప డుతున్న వారిని గుర్తించి వారి వివరాలను జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేస్తే ఏ ఆసుపత్రిలో పడకలు ఖాళీగా ఉన్నాయన్న వివరా లు తెలుస్తాయని చెప్పారు.


వెంటనే దీనికి అనుగుణంగా గ్రామాల నుంచి నేరుగా ఆయా ఆసుపత్రులలో రోగులను చేర్చాలన్నారు. కొవిడ్‌ మరణాల రేటును తగ్గించేందుకు ముందుగా గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, అనంతరం కొవిడ్‌ మెడికల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం సత్వర మెడికల్‌ సేవలు అందించడమే కర్తవ్యమన్నారు.   ప్రజల ప్రాణాలను కాపాడటంపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. జిల్లాలో జీజీహెచ్‌, పిన్నమనేని, నిమ్రా కొవిడ్‌ ఆసుప త్రులతో పాటు 11 లైన్‌ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైద్య సహాయం అందించే సౌకర్యం ఉందన్నారు. కొవిడ్‌ నియంత్రణకు మండలాల్లో వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వ యంతో పని చేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-08-04T10:01:23+05:30 IST