Covid కర్ఫ్యూలపై మధ్యాహ్నం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-21T17:27:16+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కర్ఫ్యూలు కొనసాగించాలా లేదా అనే కీలక ని ర్ణయం తేలిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం సీఎం బసవరాజ్‌ బొమ్మై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతోపాటు మంత్రులతో చర్చలు జరుపనున్నారు.

Covid కర్ఫ్యూలపై మధ్యాహ్నం కీలక నిర్ణయం

                - టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో సీఎం చర్చలు


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కర్ఫ్యూలు కొనసాగించాలా లేదా అనే కీలక నిర్ణయం తేలిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం సీఎం బసవరాజ్‌ బొమ్మై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతోపాటు మంత్రులతో చర్చలు జరుపనున్నారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచనలకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న మేరకు ఈనెల తొలివారంలో రాత్రి కర్ఫ్యూతో పాటు వారాంతపు కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. దీనికి తోడు విద్యాసంస్థలు తదితర వ్యవహారాలిన్నింటిపైనా విధించిన ఆంక్షలు గురువారంతోనే ముగిసింది. రెండురోజుల తర్వాత సమావేశంలో సమగ్ర నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించిన మేరకు అంతవరకూ పాత నిబంధనలే వర్తించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి. రెండురోజులుగా 40వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏకంగా మూడులక్షల మందిదాకా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజూ లక్ష దాకా కేసులు పెరగవచ్చునని ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సుధాకర్‌ ప్రకటించారు. తొలివిడత కొవిడ్‌ కంటే రెండో విడత డెల్టా వేరియంట్‌ పెను ప్రభావం చూపింది. మూడో విడతలో 95శాతం దాకా వైరస్‌ బాధితులు ఆసుపత్రులకు వెళ్ళి అడ్మిషన్‌ కావడం లేదు. పైగా అందుబాటులో ఉండే డాక్టర్‌లు, ఆన్‌లైన్‌ సలహాలతోనే ఇంటిపట్టునే నయం చేసుకుంటున్నారు. రెండువారాలుగా రాత్రి కర్ఫ్యూతో పాటు వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉన్నా కేసులు తగ్గుముఖం పట్టింది లేదు. పైగా వందల నుంచి వేలకువేలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా సాగుతున్న తరుణంలోనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఎటువంటి సలహాలు ఇవ్వనుందనేది కీలక కానుంది. కొవిడ్‌ కేసులు బెంగళూరులో అత్యధికంగా ఉన్నందున నగరంలో మాత్రమే విద్యాసంస్థలపై ఆంక్షలు విధించారు. మిగిలిన జిల్లాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 30 జిల్లాలలోను కేసులు కొనసాగడమే కాకుండా సుమారు 15 జిల్లాలో వందల నుంచి వేల దాకా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కర్ఫ్యూ విషయమై నిపుణుల అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ అధికార బీజేపీకు చెందిన అగ్రనేతలు మాత్రం కర్ఫ్యూతో సామాన్యుల జనజీవనం కష్టతరమేనని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి అభిప్రాయం మేరకు ప్రస్తుతానికి రాష్ట్రంలో వారాంతపు క ర్ఫ్యూ అవసరం లేదన్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఆరంభం నుంచి నైట్‌, వారాంతపు కర్ఫ్యూల సమంజసం కావని ప్రస్తావించారు. పలువురు మంత్రులు సైతం ఆంక్షల పట్ల ఆసక్తిగా లేరని తె లుస్తోంది. ఇలాంటి తరుణంలో తీసుకునే నిర్ణయాల కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2022-01-21T17:27:16+05:30 IST