Jagan సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు

ABN , First Publish Date - 2021-10-26T15:25:03+05:30 IST

Jagan సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు

Jagan సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు

అమరావతి : కొవిడ్‌ మృతుల పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబానికి రూ.50,000 మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ 19 మూలంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం వర్తింపజేయనుంది. దరఖాస్తు నమునాను కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచనలు చేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్‌ ఏర్పాటు చేశారు. దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తికి ఆదేశాలు జారీ అయ్యాయి. దరఖాస్తు కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించింది.


ఎలా అప్లై చేసుకోవాలంటే..?

- కొవిడ్‌ మరణం నిర్ధారించే కమిటీ సర్టిఫికేట్‌, మృతుల కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రతిపాదనలు పంపాలి

- కొవిడ్‌ మృతుల కుటుంబంలో వారి తర్వాత ఎవరైతే ఉంటారో వారికే ఈ నష్టపరిహారం చెల్లిస్తారు. 

- దరఖాస్తులో పేరు, మృతుడితో బంధుత్వం, చనిపోయిన ప్రదేశం, దరఖాస్తుదారుడి చిరునామా, ఆధార్‌ నెంబరు, ఆధార్‌ లింక్‌ అయిన బ్యాంకు అకౌంట్‌, మరణ ధ్రువీకరణపత్రం, సీడీఏసీ ఆమోదించిన నెంబరుని ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు నమూనాలో నింపాలి. 

- దరఖాస్తుతో పాటు స్థానిక రిజిస్ట్రార్‌ మంజూరు చేసిన మరణ ధ్రువీకరణపత్రం, సీడీఏసీ సర్టిఫికేట్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకు అకౌంట్‌ కాపీ, తహసీల్దారు జారీ చేసిన ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ కాపీలను జత చేయాలి.

- దరఖాస్తుపై ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ కూడా కౌంటర్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. చివరిగా డీఆర్‌వో సంతకం చేసి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. 

పైవన్నీ సక్రమంగా ఉంటే.. వాటి ఆధారంగా రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా విడుదలవుతుంది.

Updated Date - 2021-10-26T15:25:03+05:30 IST