తగ్గని కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-06-20T06:51:04+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది.

తగ్గని కరోనా మరణాలు

తిరుపతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. శుక్ర, శనివారాల నడుమ 24 గంటల వ్యవధిలో 854 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా తొమ్మిదిమంది కొవిడ్‌తో మరణించారు. తాజాగా గుర్తించిన బాధితులతో జిల్లాలో  కేసుల సంఖ్య 213218కి చేరగా కొవిడ్‌ మృతుల సంఖ్య 1520కి పెరిగింది. శనివారం ఉదయానికి జిల్లాలో 9782 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కాగా కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు చిత్తూరులో 66, తిరుపతి నగరంలో 62, పూతలపట్టులో 33, మదనపల్లెలో 29, పెనుమూరులో 28, పుత్తూరు, పలమనేరు, ఐరాల మండలాల్లో 27 వంతున, కుప్పం, పీలేరు మండలాల్లో 25 వంతున, గంగవరం, తవణంపల్లె మండలాల్లో 24 వంతున, పులిచెర్లలో 23, జీడీనెల్లూరులో 20, తిరుపతి రూరల్‌లో 18, పెద్దపంజాణి, సోమల, సదుం మండలాల్లో 16వంతున, ములకలచెరువు, రేణిగుంట మండలాల్లో 15 వంతున, కార్వేటినగరం, పాకాల, పీటీఎం మండలాల్లో 13 వంతున, యాదమరి, చంద్రగిరి, పుంగనూరు, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో 12 చొప్పున, నగరి, కేవీపల్లె, వెదురుకుప్పం, తంబళ్ళపల్లె, బి.కొత్తకోట మండలాల్లో 11 చొప్పున, కలికిరి, వాల్మీకిపురం, చౌడేపల్లె, నారాయణవనం మండలాల్లో 10 చొప్పున, కేవీబీపురంలో 9, శ్రీరంగరాజపురం, కురబలకోట, గుడిపాల, శాంతిపురం మండలాల్లో 8 చొప్పున, రామసముద్రం, బంగారుపాళ్యం, శ్రీకాళహస్తి, రామకుప్పం మండలాల్లో 6 వంతున, బీఎన్‌ కండ్రిగ, వడమాలపేట, నిండ్ర మండలాల్లో 5 వంతున, రొంపిచెర్ల, నిమ్మనపల్లె, సత్యవేడు, ఎర్రావారిపాళ్యం, కలకడ మండలాల్లో 4 చొప్పున, గుర్రంకొండ, పెద్దమండ్యం, విజయపురం, రామచంద్రాపురం మండలాల్లో 3 వంతున, చిన్నగొట్టిగల్లు, పాలసముద్రం, గుడుపల్లె, వి.కోట, నాగలాపురం మండలాల్లో 2 చొప్పున, వరదయ్యపాళ్యం, బైరెడ్డిపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-06-20T06:51:04+05:30 IST