Delta Effect.. అమెరికాలో గంటకు 42 మరణాలు

ABN , First Publish Date - 2021-08-19T07:33:20+05:30 IST

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా.. కొత్త వేరియంట్‌లు సవాలు విసురుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను డె

Delta Effect.. అమెరికాలో గంటకు 42 మరణాలు

వాషింగ్టన్: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా.. కొత్త వేరియంట్‌లు సవాలు విసురుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో అమెరికాలో గంటకు సరాసరి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రోజువారీ మరణాల సంఖ్య మంగళవారం ఒక్కరోజే 1017కు చేరింది. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు, మరణాలు అనూహ్యంగా పెరుగుతుండటంపట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులకు బూస్టర్ డోసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6.22లక్షలకు చేరింది. 


Updated Date - 2021-08-19T07:33:20+05:30 IST