Abn logo
Sep 22 2021 @ 11:50AM

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రెండురోజుల్లో పరిహారం

బెంగళూరు: కొవిడ్‌ కారణంగా మృతిచెందిన నిరుపేద కుటుంబాలకు తలా రూ.లక్ష పరిహారాన్ని మరో రెండురోజుల్లో విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్ట పరిహారం విడుదలలో కొంత జాప్యం జరిగిన మాట నిజమేనన్నారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు తాను ఇప్పటికే దీనిపై సూచనలు చేశానన్నారు. బీపీఎల్‌ రేషన్‌కార్డులలో పేరు ఉండి కొవిడ్‌బారిన మృతి చెందితే సదరు కుటుంబానికి రూ.లక్ష పరిహారం మొత్తాన్ని నేరుగా కుటుంబీకుల ఖాతాలో వేస్తామన్నారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో 37వేల మందికిపైగా మృ తి చెందారని వీరిలో నిరుపేదలు 15వేల మందికిపైగా ఉంటారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి నిరుపేదలకే ఈ పథకాన్ని వర్తింపచేస్తామని నిధుల లభ్యత ఆధారంగా రానున్న రోజుల్లో అందరికీ వర్తింపచేసే అంశాన్ని ప రిశీలిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.