కరోనా భయంతో హులిగెమ్మ ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2021-08-04T18:00:03+05:30 IST

రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో కొప్పళ జిల్లాలోని ప్రముఖ హులిగెమ్మ దేవస్థానం 15రోజుల కాలం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హులిగెమ్మ దేవస్థానానికి కర్ణాటక రా

కరోనా భయంతో హులిగెమ్మ ఆలయం మూసివేత

బళ్లారి(కర్ణాటక): రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో కొప్పళ జిల్లాలోని ప్రముఖ హులిగెమ్మ దేవస్థానం 15రోజుల కాలం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హులిగెమ్మ దేవస్థానానికి కర్ణాటక రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుండి భక్తులు వస్తుండటంతో కొవిడ్‌ పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో 15 రోజుల పాటు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు కొప్పళ ఉపవిభాగాధికారి కనకరెడ్డి ప్రకటించారు. భక్తులు సహకరించాలన్నారు.

Updated Date - 2021-08-04T18:00:03+05:30 IST