వైద్య విద్యార్థులపై కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-11T17:27:25+05:30 IST

ఉస్మానియా వైద్య కశాశాలలో 24 మంది వైద్య విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. దాదాపు 200 మందికిపైగా ఉండే..

వైద్య విద్యార్థులపై కరోనా పంజా

ఉస్మానియాలో 24 మందికి కొవిడ్‌

బాధితుల సంఖ్య పెరిగే అవకాశం

గాంధీలో 10 మంది హౌస్‌ సర్జన్లకూ..

కృష్ణా బోర్డు చైర్మన్‌కు కరోనా 

మొదలైన ముందుజాగ్రత్త డోసు పంపిణీ

చార్మినార్‌ యునాని ఆస్పత్రిలో ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు 

తొలి రోజు 22 వేలమందికి 

రాష్ట్రంలో మరో 1825 మందికి పాజిటివ్‌


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, జనవరి 10 : ఉస్మానియా వైద్య కశాశాలలో 24 మంది వైద్య విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. దాదాపు 200 మందికిపైగా ఉండే ఒక్కో హాస్టల్‌లో 12 మంది చొప్పున కరోనా బారినపడడంతో మిగిలిన వైద్య విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మిగిలిన విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి ప రీక్షల కోసం పంపారు.  మరోవైపు గత వారం రోజులుగా నర్సింగ్‌ విద్యార్థులకు ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఉస్మానియా ఆస్పత్రిలో మరో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాంధీలో 10మంది హౌస్‌ సర్జన్ల కు పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడ 52 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.


జిల్లాల్లో.. రాష్ట్రంలో కొత్తగా 1825 మందికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. వైర్‌సతో మరొకరు చనిపోయారు. ప్రస్తుతం 14,995 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక హైదరాబాద్‌లో 1042, మేడ్చల్‌లో 201, రంగారెడ్డిలో 147, సంగారెడి 51, హన్మకొండలో 47 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 93 మందికి, పెద్దపల్లిలో 63 మందికి, కరీంనగర్‌ లో 58 మందికి, జగిత్యాలలో ఎనిమిది మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి, ఖమ్మంలో ఏడుగురికి, మధిర తహసీల్‌లో ఏడుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతా్‌పసింగ్‌ వైరస్‌ బారినపడ్డారు. 

చార్మినార్‌ వద్ద.. రాష్ట్రంలో సోమవారం ముందుజాగ్రత్త (ప్రికాషనరీ) వ్యాక్సిన్‌ డోసు ఇవ్వడం ప్రారంభమైంది. తొలి రోజు 22045 మందికి దీన్ని ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్దనున్న ప్రభుత్వ యునానీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దేశంలోనే వ్యాక్సినేషన్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని, బూస్టర్‌ డోసుల్లో కూడా ఇదే విధంగా నంబర్‌ వన్‌గా నిలపాలని ఆయన కోరారు.  వ్యాక్సిన్‌ తీసుకోవడం ముఖ్యమని, ఏదో జరుగుతుందనే అపోహ వద్దని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, పాషాఖాద్రీ బూస్టర్‌ డోసు వేసుకున్నారు. ఇక సోమవారం రాష్ట్రంలో  2.74 లక్షల మంది టీకా తీసుకున్నారు. అందులో 1.13 లక్షల మం దికి తొలి డోసు, 1.39 లక్షల మందికి రెండో డోసు అందింది. 15-17 మధ్యవయస్కులో ఇప్పటివరకు 7,52,853 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నేటి(మంగళవారం) నుంచి ముందుజాగ్రత్త డోసు అందుబాటులో ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మీర్‌చౌక్‌  జామ్‌బాగ్‌ పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆస్పత్రి తాళాలు పగులగొట్టి లోపల ఉన్న కంప్యూటర్లతో పాటు వ్యాక్సిన్‌ వయల్స్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఎంఓ లింగమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2022-01-11T17:27:25+05:30 IST